తెలంగాణ కోటి రతనాల వీణ:కేటీఆర్

981
Telangana Koti Ratanala Veena says KTR
- Advertisement -

సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు టీఆర్ఎస్‌లో చేరిన మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డికి పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు కేటీఆర్. తెలంగాణ భవన్‌లో వేలాది మంది అనుచరులతో కలిసి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ మెదక్‌ కంటే కరీంనగర్‌లో టీఆర్ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు.

తెలంగాణలో రాజకీయ పునరేకికరణ జరుగుతోందన్నారు. ప్రజలంతా ఒకవైపు ఉంటే తాము మరోకవైపు ఉండటం సరికాదని టీఆర్ఎస్‌లో నాయకులు అందరూ చేరుతున్నారని చెప్పారు. తెలంగాణలో టీడీపీ ఖతం అయిందని కాంగ్రెస్ కూడా ఖాళీ కాబోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై విశ్వాసం లేక ఆ పార్టీని వీడుతున్నారని చెప్పారు.

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బంగారు తెలంగాణగా మారబోతుందన్నారు. ప్రజల ఆకాంక్షలు ఇతివృత్తంగా పనిచేయాలని కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారని గుర్తుచేశారు. గోదావరి జలాలు నర్సాపూర్‌కు తీసుకువస్తామన్నారు. తెలంగాణ కోటి రతనాల వీణే కాదు రాబోయే రెండున్నర సంవత్సరాల్లో తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కాబోతున్నారు. కాళేశ్వరం,పాలమూరు ఎత్తిపోతల పథకంతో తెలంగాణ సాగునీటి రంగంలో కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. నర్సాపూర్‌లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామన్నారు.

భారతదేశ భవిష్యత్ ప్రాంతీయ పార్టీలదే అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు బాగుపడాలంటే ప్రాంతీయ పార్టీలే కీలకం కావాలన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందోని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రావాలన్నా,బయ్యారం ఉక్కు పరిశ్రమ రావాలన్న టీఆర్ఎస్ 16 స్ధానాలు గెలిచి తీరాలన్నారు. జాతీయ పార్టీలతో తెలంగాణకు ఒరిగేది శూన్యం అన్నారు.

బీజేపీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని ఆచరణలో మాత్రం గడపదాటడం లేదని ఎద్దేవా చేశారు. పాలమూరులో మోడీ తెలంగాణకు చేసిందేమీ లేక ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అవాకులు,ఛవాకులు పేలారని మండిపడ్డారు. మెదక్‌లో కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు.

- Advertisement -