తెలంగాణొస్తే ఏమొచ్చింది..తేడా ఇదే

192
- Advertisement -

తెలంగాణొస్తే ఏమొచ్చింది అనడానికి ఈ ఎనమిదేళ్ల సీఎం కేసీఆర్ పాలనే ఉదాహరణ. కొత్త రాష్ట్రం.. ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలు..తెలంగాణ నిలిచి గెలుస్తుందా అంటూ సర్వత్రా అనుమానాలు..కానీ సీఎం కేసీఆర్ దీక్షాదక్షతతో ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేశారు. నేడు ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా చేశారు.. నేడు మన తెలంగాణ దేశంలో అన్నిరాష్ట్రాలకు ఆదర్శంగా మారిందంటే అది కేవలం సీఎం కేసీఆర్ సుపరిపాలనే.

రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలో కారు చీకట్లను తొలగిస్తూ కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారు. దేశంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. నాడు కరెంట్ ఉంటే వార్త….నేడు కరెంట్ పోతే వార్త అన్న స్ధాయికి తీసుకొచ్చారు. ఒక్క వ్యవసాయమే కాదు నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా ప్రతి అంశాన్ని పరిపూర్ణం చేస్తూ ముందుకుసాగారు.

అభివృద్ధి వీకేంద్రీకరణ జరగాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యాధునిక సదుపాయాలతో రోడ్లు,వైద్యం, విద్యకు పెద్ద పీట వేశారు. ఇక ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించగా పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. అంతర్జాతీయ కంపెనీలు సైతం హైదరాబాద్‌ సెఫేస్ట్ అని డిసైడ్ అయ్యాయంటే గతానికి ఇప్పటికి ఉన్న తేడాను అర్థం చేసుకోవచ్చు.

ఇక ముఖ్యంగా నగరవాసులను ట్రాఫిక్‌ పద్మవ్యూహం నుంచి తప్పించి.. సులువైన ప్రయాణం కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలో, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు సత్ఫలితాలిస్తున్నది. నగరంలోని అనేక జంక్షన్లలో ప్రయాణం సాఫీగా సాగిపోతున్నది. మొదటిదశలో చేపట్టిన 47 ప్రాజెక్టుల్లో 33 దిగ్విజయంగా పూర్తి చేశారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మరే నగరంలో కూడా ఇంత తక్కువ సమయంలో ఇన్ని రోడ్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. గ్రేటర్ ప్రజలు సైతం బహిరంగంగానే సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ట్రాఫిక్ నరకం నుండి ప్రజలను బయటపడేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని కొనియాడుతున్నారు. పట్టుదల, అంకితభావం ఉన్న నాయకత్వం ఉంటేనే ఇటువంటివి సాధ్యం అని అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -