తారక్‌ను కాపీ కొట్టనున్న బన్నీ…

624
- Advertisement -

ఈ మధ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ బన్నీ ఒకరి రూట్లో ఒకరు నడుస్తున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ అడ్డా కేరళాలో తారక్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్ చేసిన పాత్రను పోలిన పాత్రను బన్నీ చేయబోతున్నాడు. అదుర్స్‌ సినిమాలో తారక్ చారి పాత్రలోఎంటర్ టైన్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇదే తరహా రోల్‌లో అల్లు అర్జున్ కూడా నటించబోతున్నాడు. బన్నీ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న దువ్వాడ జగన్నాధం మూవీలో ఈ పాత్ర ఉండనుంది.

హరీష్ శంకర్ ప్రత్యేకంగా బన్నీ కోసం ఇలాంటి పాత్ర క్రియేట్ చేయడం వెనక ఓ స్టోరీ ఉంది. అదుర్స్ సినిమాకు హరీష్ శంకర్ ఘోస్ట్ రైటర్ గా పనిచేశాడు. వి.వి వినాయక్ ఈ సినిమాలో ఎన్టీఆర్‌-బ్రహ్మానందం కాంబినేషన్‌లో వచ్చిన సన్నివేశాలన్నీ హరీష్ రాసినవేనట. ఇప్పుడు బన్నీ కోసం అలాంటి పాత్రనే క్రియేట్ చేశాడట ఈ దర్శకుడు. ఆ మూవీలో తారక్ లాగే ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్‌ ఓ బ్రాహ్మణ పాత్రలో నటిస్తున్నాడు. చూడబోతే దువ్వాడ జగన్నాదమ్ మూవీని ఆదుర్స్‌ 2 అనుకోవాలో ఏమో. రీసెంట్ గానే షూటింగ్ ప్రారంభమైన ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే.

- Advertisement -