తప్పుడు వార్తలపై హరీష్ ఫైర్

872
T Harish Rao
- Advertisement -

ప్రముఖ ఆంగ్లపత్రిక డెక్కన్ క్రానికల్ ఇవాళ సంచలన వార్తను ప్రచురించిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి హరీష్ రావు త్వరలో బీజేపీలో చేరుతున్నారని హైలెట్ చేస్తూ కథనాన్ని ప్రచురించింది. గత కొన్నాళ్లుకు టీఆర్ఎస్‌లో ప్రాధాన్యత తగ్గడంతో ఆయన టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరనున్నారని రాసి చివర్లో ఇది ఏప్రిల్ ఫూల్స్ డే అని ప్రాంక్ చేయబోయింది.

ఈ వార్త నెట్టింట్లో వైరల్‌ కావడంతో హరీష్ స్పందించారు. దేశం మొత్తం తప్పుడు వార్తలపై యుద్ధం చేస్తున్న తరుణంలో ఇలా ప్రాంక్ పేరుతో తప్పుడు వార్తల్ని ప్రచురించడం సరికాదని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఏ పేజీలో అయితే తప్పుడు వార్తల్ని పబ్లిష్ చేశారో అదే పేజీలో రేపు క్షమాపణలు చెప్పాలని ఆ వార్తా సంస్థని డిమాండ్ చేశారు.

గతంలోనూ తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించారు హరీష్. టీఆర్ఎస్ ను వీడి హరీష్ కాంగ్రెస్ లో చేరుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగగా వాటిని ఖండించిన హరీష్ పోలీసులకు ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే.


- Advertisement -