తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, ధన్యబాలకృష్ణన్, చలాకి చంటి, శివన్నారాయణ, ఫిష్ వెంకట్ తదితరులు నటీనటులుగా రూపొందుతున్న చిత్రం ‘తను.. వచ్చేనంట’. అచ్యుత ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ కాచర్ల దర్శత్వం వహిస్తున్నారు. శరవేగంగా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ నెలాఖరులో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల మాట్లాడుతూ “మా చిత్ర ప్రమోషన్ నిమిత్తం రేష్మి గౌతమ్, తేజ కాకుమాను, చలాకి చంటిలు విజయవాడ లోని విజయవాడ సిద్దార్ధ కాలేజీ, ఎస్ ఆర్.కె. కాలేజీ, మాంటిసోరి కాలేజీ మరియు ఖాన్ సాబ్ రెస్టారెంట్ లలో హల్చల్ చేసారు. ఈ సందర్భంగా పులువురు విద్యార్థులు, పబ్లిక్ మా చిత్ర యూనిట్ తో ఫోటోలు, సెల్ఫీలు దిగారు. ఇటీవల రిలీజ్ చేసిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో మొదటిసారిగా వస్తున్న జామెడీ గురించి చాలామంది ఉత్సాహంగా అడిగారు. జామెడీ కాన్సెప్ట్ గురించి ఇంతగా జనాల్లోకి వెళ్లినందుకు మాకు చాలా ఆనందంగా వుంది. మా హీరో తేజ కాకుమాను విజయవాడ వాడే కావడంతో జనాల్లో అతనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా మంది జనాలు మీ చిత్రం ట్రైలర్ చూసాము, సాంగ్స్ విన్నాము చాల బాగున్నాయి అని చెప్తున్నారు. ఈ రెస్పాన్స్ చూస్తే మేము సగం విజయం సాధించాం అనిపిస్తుంది. అదే విధంగా మా చిత్ర యూనిట్ వైజాగ్ కూడా ప్రమోషన్ నిమిత్తం వెళ్తున్నాము. ఈ చిత్రాన్ని ఈ నెల ఆఖరికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. మొదటినుంచి మాచిత్రాన్ని జనాలకి బాగా చేరువ చేసిన అల్ మీడియా వారికి కృతఙ్ఞతలు తెలుపుతున్నాము” అని అన్నారు.
హీరో తేజ కాకుమాను మాట్లాడుతూ “నేను విజయవాడ లోనే చదువుకున్నాను. నను ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు బాహుబలి చిత్రం తర్వాత ఈ సినిమాలో హీరోగా తొలి పరిచయం కావడం ఆనందంగా ఉంది.” అని అన్నారు.
ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యుసర్: బెక్కెం రవీందర్, ఆర్ట్: సిస్తల శర్మ, కెమెరా: రాజ్‌కుమార్, ఎడిటింగ్ టీమ్: గ్యారీ బి.హెచ్; గణేష్.డి, విజువల్ ఎఫెక్ట్స్: విజయ్, సంగీతం: రవిచంద్ర, నేపథ్య సంగీతం: శశిప్రీతం, సహనిర్మాత: పి.యశ్వంత్, పాటలు: చల్లా భాగ్యలక్ష్మీ, కథ-నిర్మాత: చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల, క్రియేటివ్ ప్రొడ్యూసర్: కె. రాఘవేంద్రరెడ్డి.