హిజ్రా అని తెలియదు-హిజ్రాకి కట్నం వేధింపులు..!

726
- Advertisement -

వరకట్న వేధింపులు ట్రాన్స్ జెండర్లకు కూడా తప్పడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట వివాహిత వరకట్న వేధింపులకు బలికావడం చూస్తునే ఉంటాం. కానీ.. తాజాగా తమకు కూడా ఈ వేధింపులు తప్పడం లేదని ట్రాన్స్ జెండర్ దీపిక ఆరోపిస్తోంది. వరకట్నం కోసం నిత్యం తన భర్త సురేష్ చిత్రంహింసలకు గురి చేస్తున్నాడని విశాఖ పోలీసులను ఆశ్రయించింది.

సురేష్ తనను హింస్తున్నాడని.. తనను నమ్మించి పెళ్లి చేసుకున్నాడని.. రూ. 6 లక్షల కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నాడని దీపిక ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను దీపిక భర్త సురేష్ కొట్టిపారేశారు. దీపిక చేసే ఆరోపణలు అవాస్తమని మీడియా ముందుకు వచ్చాడు. దీపిక చెబుతున్న అంశాల్లో నిజం లేదని.. వాస్తవానికి తానే దీపిక చేతుల్లో మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. దీపిక ఓ హిజ్రా అని తనకు పెళ్లికి ముందు తెలియదని సురేష్ వాపోయాడు.

తాను ట్రాన్స్ జండర్ అన్న విషయాన్ని పెళ్లికి ముందు గోప్యంగా ఉంచి.. వివాహం చేసుకుందని చెప్తున్నాడు. అంతేకాదు.. ఫోర్జరీ సంతకాలతో తప్పుడూ బాండ్లను సృష్టించి మరోసారి తనను మోసం చేయాలని చూస్తోందని ఆయన ఆరోపిస్తున్నాడు. ఈ విషయంలో తాను న్యాయపోరాటానికి కూడా సిద్దమని సురేష్ స్పష్టం చేస్తున్నాడు.

ఇక ఈ వ్యవహారం పోలీసులకు సవాల్ గా మారింది. దీపిక హిజ్రా ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్నారు కానీ.. విచారణ ఎలా చేపట్టాలన్న దానిపై ఆలోచనలోపడ్డారు.

- Advertisement -