- Advertisement -
ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు పోలీసు అధికారులపై వేటువేశారు పోలీస్ బాస్. ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డితో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.
సస్పెండైనవారిలో ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాస్, రాంబాబులు ఉన్నారు. జయరాం హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని రాకేష్ రెడ్డికి సలహా ఇచ్చినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. రాకేష్‌తో కలిసి భూదందాలు కూడా చేయడంతో వీరిని సస్పెండ్ చేశారు.
జనవరి 31న రాత్రి కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో కారులో ఎన్నారై చిగురుపాటి జయరామ్ అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. ముందు ఆత్మహత్యగా భావించినా విచారణలో హత్యగా తేలింది. ఈ కేసులో జయరాం మేనకోడలు శిఖా చౌదరి ప్రియుడు రాకేష్‌రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
- Advertisement -