జయప్రదను చూసి లొట్టలేసుకుంటా…

232
Mohan Babu 40 years of film life celebrations in Vizag
Mohan Babu 40 years of film life celebrations in Vizag
- Advertisement -

టాలీవుడ్ లో విలక్షణ నటుడు ఎవరు అంటే ఠక్కున ‘మోహన్ బాబు‘ అని చెప్పేస్తారు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు విజయవంతమయ్యాయి. విలనిజం, మేనరిజం, హీరోయిజాన్ని కలబోసుకున్న ఈ నటుడికి విశాఖలో సన్మాన కార్యక్రమం జరిగింది. టి.సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా మోహన్బాబుకు 40 సంవత్సరాల సినీ ప్రస్థాన సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో సినీ తారలు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన మోహన్బాబు పలు విషయాలు ప్రస్తావించారు.

ఇప్పటి జనరేషన్లో చాలా మంది హీరోయిన్లు వస్తున్నారని, కానీ ‘జయప్రద’ వాట్ ఏ బ్యూటీ.. ఇప్పటికీ చూస్తే .. ‘నా భార్య ఉంది గానీ లేకపోతే తాను అప్పుడప్పుడూ జయప్రదను చూసినప్పుడు లొట్టలేసుకుంటూ ఉంటానని నవ్వేశారు మోహన్ బాబు. ఈ కామెంట్ తో పక్కనే వున్న జయప్రద కూడా ఫక్కున నవ్వేసింది.
‘జయప్రద’ ఓ మంచి నటి అని తాను అసిస్టెంట్ డైరక్టర్గా చేసినప్పుడే ఆమె హీరోయిన్ అని అన్నారు. ‘జయప్రద’తో హీరోగా, విలన్గా చేశానని, అలాంటి ‘జయప్రద’ ఎంతో దూరం నుంచి రెండు మూడు ఫ్లైట్లు మారుతూ వైజాగ్ కు చేరుకున్నారని తెలిపారు. ఇందుకు తాను హృదయపూర్వకంగా అభినందనలు ‘జయప్రద’కు తెలిజేస్తున్నానని అన్నారు. అయితే ఈ సమయంలో అటు జయప్రదతో పాటు మోహనన్‌ బాబు సతీమణి కూడా నవ్వులు పూయించారు.

- Advertisement -