‘జనతా గ్యారేజ్ ‘లో కొత్త సీన్లు…

274
New scenes added in Janatha Garage
New scenes added in Janatha Garage
- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకే చిత్రం గురించి ఎక్కడ చూసినా టాక్ నడుస్తుంది..అదే ‘జనతా గ్యారేజ్’. మొదటి రోజు ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తర్వాత రోజు నుంచి పుంజుకుంది. ఇక దర్శకుడిగా కొరటాల, హీరోగా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో హ్యాట్రిక్ కొట్టారు. గత వారం రోజుల నుంచి ఈ చిత్రానికి పెద్ద చిత్రాలు పోటీలో లేవు అంతే కాకుండా మూడు రోజులు వరుసగా సెలవులు రాడంతో కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతుంది. ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం వంద కోట్ల దిశగా పరుగులు తీస్తుంది.

New scenes added in Janatha Garage

జనరల్ గా ప్లాప్ అయిన సినిమాలకి కొత్త సీన్లు లేదా పాటలు కలిపి ప్రమోట్ చేయడం చూస్తాం .కానీ కొరటాల శివ అందుకు భిన్నం .తీసిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ ..అయినా మూడు సార్లు అయన సినిమా రిలీజ్ అయ్యాక కొత్త సీన్లు కలిపాడు. మిర్చి విడుదలయ్యాక మూడు వారాలకు వర్షం ఫైట్ను సినిమాలో కలిపాడు కొరటాల. ఆ ఫైట్ ప్రేక్షకులను బాగానే అలరించింది. ఆ సీన్కు ఒక్కదానికే కోటి రూపాయల దాకా ఖర్చు చేశారు. ఇక, ఆ తర్వాత శ్రీమంతుడులోనూ రెండు వారాల తర్వాత మరికొన్ని సీన్లను కలిపాడు. మరి అది సెంటిమెంట్ అని భావించాడో ఏమో కానీ.. ఇప్పుడు జనతాగ్యారేజ్లోనూ కొన్ని సీన్లను కలిపాడు ఈ హ్యాట్రిక్ డైరెక్టర్. సినిమాకు వచ్చే రెస్పాన్స్ను బట్టి కొన్ని సీన్లను కలుపుతామన్న కొరటాల.. అలాగే కలిపేశాడు. సినిమాలో ఎలాంటి పరిచయం లేకుండా పాటతో ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తాడన్న సంగతి తెలిసిందే.

New scenes added in Janatha Garage

జనతా గ్యారేజ్ లో కొత్తగా యాడ్ అయిన సీన్లన్నీ ఎన్టీఆర్ కి సంబంధించినవే .అయన ప్రకృతి గురించి చెప్పే సీన్ ..సమంత తో లవ్ సీన్లు శివ కొత్తగా కలిపాడు .అసలే జనతా గ్యారేజ్ హిట్ తో మంచి హుషారుగా వున్నఎన్టీఆర్ ఫాన్స్ కి ఈ వార్త పండగే .రిపీట్ ఆడియన్స్ తో జనతా గ్యారేజ్ కలెక్షన్స్ కి కూడా ఈ నిర్ణయం దోహదం చేస్తుందని నిర్మాతలు ,డిస్ట్రిబ్యూటర్స్ ఆశిస్తున్నారు .

- Advertisement -