మెగాస్టార్ చిరంజీవి సామాజిక న్యాయంతో 2009లో రాజకీయ పార్టీని స్థాపించి 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. సామాజిక న్యాయంపేరిట ప్రేమే లక్ష్యం… సేవే మార్గం అనే సిద్ధాంతంతో ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ 18 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అయితే ఆ తదననంతరం ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయింది. ఆ పార్టీకి 2009 ఎన్నికల్లో దాదాపు 80 లక్షల మంది ఓటువేశారు.
ఆ తర్వాత 2014 ఎన్నికల్లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేశారు… ఆ సమయంలో చిరుపై, ఆయన తమ్ముడిపై టీడీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు… బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ స్నేహితుడు మాట్లాడుతూ చిరంజీవిపై, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. సామాజిక న్యాయం పేరుతో 80 లక్షల మంది ప్రజల ఓట్లు వేయించుకుని కనీసం వారికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఏకపక్షంగా పార్టీని సోనియాగాంధీ పాదాల దగ్గర పెట్టారని, 80 లక్షల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. ఇక పవన్ కళ్యాన్ ప్రజారాజ్యం తరుపున ఎన్నికల ప్రచారం చేశారని ఆరోపించారు.
టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్ మిత్రుడు చిరంజీవిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన వీడియో ఇప్పుడు నెట్లో వైరల్ గా మారింది. ఇంతకూ ఆయన చిరంజీవిని ఏమన్నాడో ఈ వీడియోలో మీరే చూడండి…
https://youtu.be/Cc_bA4FSPzI