గుజరాత్‌లో ఓ మహిళ చావు అంచుల దాక వెళ్లి వచ్చింది.పట్టాలు దాటే ప్రయత్నంలో ఒక్క క్షణం ఆలస్యమైన ఆ మహిళ రైలు కింద పడి ముక్కలు ముక్కలు అయి ఉండేది. ప్లాట్ ఫాం పైన ఉన్నావాళ్లు స్పందించి ఆమెను రక్షించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది.
ఓ ప్రయాణికురాలు తన కుమారుడితో రైల్వే స్టేషన్‌కు వచ్చింది. ఒక ప్లాట్ ఫాం నుంచి మరో ప్లాట్ ఫాంకు వెళ్లేందుకు పట్టాలపైకి దిగింది. అదే సమయాంలో అదే పట్టాలపైన రైలు వస్తుంది. ఆ రైలును చూసి కూడా అమె ఆగలేదు. ఆగకుండ కిందకు దిగింది. ఇంతలో రైలు దగ్గరకు వచ్చేసరికి ఆమె బెంబెలెత్తిపోయింది. తన చేతిలో ఉన్న బ్యాగ్ ను ప్లాట్ ఫాం మీదకు విసిరేసింది. వెంటనే గమనించిన ప్రయాణికులు ఆమెను పైకి లాగారు. దీంతో ఆ మహిళ క్షేమంగా బయటపడింది. క్షణాల్లో జరిగిన ఈ ఘటన రైల్వే స్టేషన్‌లో ఉన్న సీసీటీవీ కేమెరాలో రికార్టు అయ్యింది.దహోద్ రైల్వే స్టెషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
https://youtu.be/KhD1qnndv5Y