చంద్రబాబుకు ఈసీ షాక్‌.. యువనేస్తానికి బ్రేక్‌..

695
chandrababu
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుకు మరోసారి షాక్‌ తగిలింది. టీడీపీ అత్యంత కీలకంగా భావిస్తున్న ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు షురూ అయిపోయాయనే చెప్పాలి. నిన్నటికి నిన్న ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ – వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతాలపై హైకోర్టు ఇచ్చిన సంచలనాత్మక తీర్పుల నేపథ్యంలో ఈసీ కూడా తనదైన శైలి కొరడా ఝుళిపించేందుకు రంగం సిద్ధం చేసింది.

చంద్రబాబు కొన్ని నెలల క్రితమే యువనేస్తం పథకంలో భాగంగా డిగ్రీ విద్యార్హత ఉన్న నిరుద్యోగులకు రూ.1000 భృతి అందించాలని నిర్ణయించారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ, నిరుద్యోగ భృతిని రూ.1000 నుంచి రూ.2000కి పెంచుతున్నట్టు ప్రకటించారు.

నిరుద్యోగ భృతిని పెంచుతున్నట్టు బాబు ఎన్నికల ప్రచారంలో చెప్పడాన్ని ఈసీ తప్పుబట్టింది. ఇలా ప్రకటించడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, నియమావళికి విరుద్ధమని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికలు ముగిసేవరకు ఆ పెంపు నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది.

- Advertisement -