కోచ్ గోపిచంద్ వల్లే ఒలింపిక్స్‌లో పతకం సాధించానని పీవీ సింధు తెలిపింది. గురువారం టీ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన సింధు…కోచ్ గోపిచంద్ లేకుంటే తాను ఈ స్టేజ్‌లో ఉండేదాన్ని కాదని…గోపిచంద్ నా రోల్ మాడల్ అని తెలిపింది. ఒలింపిక్స్‌లో తాను చాలా కష్టపడి ఆడానని….తొలిసారి ఒలింపిక్స్‌కు వెళుతున్న తాను పతకం సాధిస్తానని అనుకోలేదని తెలిపింది.
కెరీర్‌లో ఒడిదొడుకులు ఎదురైన తల్లిదండ్రులు,కోజ్ సహకారంతో బ్యాడ్మింటన్‌లో రాణించానని తెలిపింది. స్కూల్‌లో బాగా చదివేదానినని…చదువంటే ఇష్టమని తెలిపింది. చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్ ఇష్టమని…అంతర్జాతీయ స్ధాయిలో రాణించాలంటే కావాల్సిన మెళకువలను నేర్చుకున్నాని తెలిపింది.
కొన్ని గెలిచే మ్యాచ్‌లలో ఓడిపోయినప్పుడు ఏడ్చేసేదానినని….తల్లిదండ్రులు నన్ను ఓదార్చేవారని తెలిపింది. తనకోసం తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేశారని..అమ్మ ఉద్యోగానికి రాజీనామా చేసి తనకు మోరల్ సపోర్ట్‌గా నిలిచిందని సింధు తెలిపింది.
ఒలింపిక్ష్ పతకం సాధించటం వెనుక సింధు కష్టం ఎంతో ఉందని..సింధు గ్రేట్ స్టూడెంటని కోచ్ గోపిచంద్ అభినందించారు. ప్రతి ఏడాది తన ప్రతిభను మెరుగుపర్చుకుంటూ…ఇవాళ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిందని తెలిపింది.