లైఫ్‌ లేకున్నా జియో సిమ్‌

225
Reliance 4G
- Advertisement -

జియో ఎంట్రీ రంగం సిద్దమవుతుండగా ఇతర టెలికాం సంస్థల్లో గుబులు మొదలైంది. తమ డాటా టారీఫ్‌లను భారీగా తగ్గించుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. ఇక 90 రోజుల ప్రివ్యూ ఆఫర్‌తో లభిస్తోన్న జియో సిమ్ కోసం జనం బారులుతీరుతున్నారు.

అయితే రిలియన్స్ మొదటగా జియో 4జీ సిమ్‌లను రిలయన్స్‌ స్టాఫ్‌కు మాత్రమే ఆఫర్ చేసింది. ఆ తరువాత రిలయన్స్ లైఫ్ మొబైల్స్ తీసుకున్నవారికి ఈ జియో సిమ్‌లను అందించారు. తాజాగా వెలువడిన ప్రకటన ప్రకారం 4జీ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే ప్రతి ఒక్కరూ జియో 4G సిమ్‌ను పొందవచ్చు.

gio
సామ్‌సంగ్, ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్లు వాడే యూజర్లు ‘MyJio’ యాప్‌ను తమ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా రిలయన్స్ జియో సిమ్‌ను పొందే అవకాశముంటుంది. ఈ యాప్‌లో కనిపించే ‘Get Jio SIM’ ఆప్షన్ పై క్లిక్ చేయటం ద్వారా తదుపరి ప్రొసీడింగ్ లెవల్‌కు మీరు వెళతారు.

ఒక్కో యూజర్‌కు రిలయన్స్ జియో జారీ చేసే కోడ్ ఇతరులకు బదిలీ చేయలేని విధంగా ఉంటుంది. ఈ కోడ్‌ను పొందే క్రమంలో యూజర్ తన పర్సనల్ ఈమెయిల్ ఐడీతో పాటు అడ్రస్ ప్రూఫ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. నిర్ధేశిత తేదితో వచ్చే ఈ కోడ్‌ ఆ గడువులోపే పనిచేస్తుంది.

JIo

జియో సిమ్ పొందలానుకునే వారు సమీపంలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్‌కు వెళ్లి సంబంధిత ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. .ఈ సిమ్‌తో పాటు అందిస్తోన్న 90 రోజుల ప్రివ్యూ ఆఫర్‌లో భాగంగా మూడు నెలల వాయిస్ , డేటా ఇంకా మెసేజింగ్ సేవలను ఉచితంగా ఆస్వాదించవచ్చు.

- Advertisement -