గోకుల్ చాట్ యజమానికి కరోనా పాజిటివ్..‌

320
Gokul Chat
Gokul Chat
- Advertisement -

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. నిత్యం వందల సంఖ్యలో కరోనా కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌ కోఠిలో గోకుల్ చాట్ యజమాని విజయ వర్ఘీ (72)కి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమై గోకుల్ చాట్ దుకాణాన్ని మూసివేశారు. అంతేకాదు అతడి కుటుంబ సభ్యులతో పాటు 20 మంది గోకుల్ చాట్ సిబ్బందిని క్వారంటైన్ చేశారు. గత 3 రోజులుగా షాప్‌కు ఎవరెవరు వచ్చారన్న దానిపై ఆరా తీస్తున్నారు.

- Advertisement -