బంగారు తెలంగాణా సాధనకు తెలంగాణా జాగృతి సంస్థ అంకితమై పనిచేస్తున్న సంగతి తెలిసిందే. జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలకు జాతీయ గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న జాగృతి ఆధ్వర్యంలో జరిగే స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమానికి రావాల్సిందిగా గవర్నర్ నరసింహన్‌ను ఎంపీ కవిత కోరారు. సెంట్రల్ స్కిల్ డెవలప్ మెంట్ మినిష్టర్ రాజీవ్ ప్రతాప్ రూడీ సెప్టెంబర్ 2న రాష్ట్రానికి వస్తున్నారని తెలిపింది. తమ ఆహ్వానాన్ని గవర్నర్ అంగీకరించారన్నారు కవిత.
మరుగున పడ్డ తెలంగాణ సంస్కృతికి జీవం పోసింది జాగృతి. కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా స్కిల్ డెవలప్ మెంట్, మహిళా సాధికారికత, చైతన్యకార్యక్రమాలను నిర్వహిస్తు ప్రజల మన్ననలు పొందుతుంది. జాగృతి స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా 3500 మంది యువకులకు ట్రైనింగ్ ఇవ్వగా ….ఆరు నెలల్లోనే 1500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు.