బతుకు జట్కా కోసం బలవంతం చేస్తున్న జీవిత రాజశేఖర్

1131
bathuku bandi
bathuku bandi
- Advertisement -

ఈ మధ్య టీవీ ఛానెల్స్‌ లో మధ్యాహ్నం 12 అయ్యిందంటే చాలు అభాగ్యుల బ్రతుకులని బాగు చేసే ప్రోగ్రామ్స్‌ ఎక్కువై పోయాయి. మీ బతుకుల్ని బాగు చేస్తామని చెప్పి వారిని తీసుకొచ్చి వీళ్లు… ఒక ఛానెల్‌ లో బతుకు జట్కాబండి అంటారు.. మరో ఛానెల్‌ లో రచ్చబండ అంటారు. ఇక ఇంకో ఛానెల్‌లో సంసారం ఒక చదరంగం అంటూ ప్రముఖ నటి నటులతో షోలు చేపించేస్తున్నారు.

bathuku bandi

అసలు ఇంతకు ఈ షోలకు వచ్చే వారి కష్టాలు నిజమైన వేనా? అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఇక ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్‌ గురించి ఒక విషయం బయటికి వచ్చింది. అదేమిటంటే జీ తెలుగు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బతుకు జట్కాబండి గురించి ఆ న్యూస్‌. ఈ ప్రొగ్రాంకి వ్యాఖ్యాత జీవిత రాజశేఖర్‌ చేస్తోంది.

ఈ కార్య‌క్ర‌మానికి రావాలంటూ ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడుతున్న జీవిత రాజశేఖర్‌ వ్యక్తిగత కార్యదర్శులపై చిలకలగూడ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ సంఘ‌ట‌న పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

bathuku bandi

న‌గ‌రంలోని పార్శిగుట్ట సవరాల బస్తీకి చెందిన పి.కొండ(29) ఆటో డ్రైవర్‌… 2005వ సంవత్సరంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జ్యోతి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె సంపూర్ణ(9). రెండో కాన్పులో జ్యోతికి టీబీ వ్యాధి రావడంతో బాబుపుట్టి చనిపోయాడు. అనారోగ్యంగా ఉన్న జ్యోతి తల్లిగారింటివద్ద ఉంటోంది. గ్రామ పెద్ద‌ల స‌మ‌క్షంలో కొండ‌-జ్యోతి పేప‌ర్ల మీద సంత‌కాలు చేసుకుని విడిపోయారు. జ్యోతికి కొండ లక్ష రూపాయలు ఇచ్చాడు.

bathuku bandi

ఇటీవల జ్యోతి బతుకు జట్కాబండి కార్యక్రమ నిర్వాహకురాలు జీవిత రాజశేఖర్‌ను ఆశ్రయించింది. దీంతో జీవితరాజశేఖర్‌ వ్యక్తిగత కార్యదర్శులు కిరణ్‌, మరో మహిళ.. కొండ అతడి త‌మ్ముడికి ఫోన్ చేసి ఈ కార్య‌క్ర‌మానికి రావాల‌ని ముందుగా అడిగారు. అయితే అందుకు కొండ ఒప్పుకోక‌పోవ‌డంతో అత‌డి తమ్ముడికి ఫోన్లుచేసి బెదిరించడం ప్రారంభించారు. వారి మాటలను రికార్డు చేసి కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు జీవిత వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శుల‌పై కేసులు న‌మోదు చేశారు.

- Advertisement -