కొడుకు కోసం తండ్రయ్యింది..

249
- Advertisement -

సృష్టిలో ఎంతో తియ్యనైనది తల్లి ప్రేమ…. అమ్మ ప్రేమ వివరించడానికి మన ఈ జన్మ సరిపోదు. అది అనుభవించే వచ్చే ఓ తియ్యని వరం.అందుకేమో ఓ కవి అన్నాడు “ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్న తియ్యని కావ్యం , ఎవరు పాడగలరు అమ్మ అను రాగం కన్నా తియ్యని రాగం అని” నిజంగానే “పెదవే పలికిన మాటల్లో తియ్యని మాటే అమ్మ”. పిల్లలకు అన్నీ తానై అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేస్తారు తల్లిదండ్రులు. వాళ్ల కోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధపడతారు.

బిడ్డల భవిష్యత్తుకు మించి తల్లిదండ్రులకు వేరే ప్రాధాన్యతలు ఉండవు. అయితే అమ్మ, నాన్న వీరిలో ఎవరైనా దూరమైతే ఆ లోటు పిల్లలకు ప్రతిచోటా కనిపిస్తుంది. ఆ లోటు లేకుండా తల్లిదండ్రులు తమ పిల్లల్ని కంటిపాపల్లో పెట్టుకొని పెంచుకుంటారు. అలాంటి ఓ తండ్రిలేని పిల్లాడికి అమ్మే నాన్నలా మారింది.

Mom dresses as dad for son

తన కొడుకును తండ్రి లేని బాధను తీర్చేందుకు ఓ తల్లి ముందుకొచ్చింది. తండ్రి పాత్రనే కాదు తండ్రి ఆహార్యాన్నే ప్రదర్శించి ఆ బిడ్డ సంతోషాన్ని రెట్టింపు చేసే ప్రయత్నం చేసింది. అందరి మన్ననలు, ఆశీస్సులు అందుకొంది. ఆమే పేరు వస్క్యూజ్‌.ఎవట్టే కొడుకు ఎలిజాను ఓ రోజు స్కూల్లో వదిలిపెట్టడానికి వెళ్లింది.అక్కడ అధిక సంఖ్యలో కార్ల పార్కింగ్‌ చూసి విషయం ఏంటని కొడుకుని అడిగి తెలుసుకుంది. అంతే.. వెంటనే తన కొడుకుని వెంటబెట్టుకొని తిరిగి ఇంటికి చేరి.. పురుషుడిలా వేషధారణ మార్చుకుంది.

ప్యాంటు, షర్ట్‌.. తలపై టోపీ.. కృత్రిమంగా పెట్టుకున్న మీసంతో తండ్రి అవతారం ఎత్తింది. టెక్సాస్ లోని ఓ స్కూల్‌లో ఓ ముఖ్యమైన ఈవెంట్‌ జరుగుతుంది. దానిపేరు ‘డోనట్స్‌ విత్‌ డాడ్‌’. పిల్లలతోపాటు నాన్నలు మాత్రమే అల్పాహారం సేవించే కార్యక్రమం అది.

dad

మరి తండ్రిలేని ఆ బిడ్డకు అందులో పాల్గొనే అవకాశం లేదు. అలా జరిగితే తన కొడుకు ఎంతో బాధపడతాడని ఆలోచించిన ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. అలా జరగకుండా ఉండాలని తండ్రి వేషధారణలో స్కూలుకి వెళ్లి తన కొడుకు సంతోషాన్ని రెట్టింపు చేసింది. అక్కడున్న మిగతా విద్యార్థులు, తండ్రులు ఆమెను చూసి ఎంతో గర్వించారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి పలువురి ప్రశంసలను అందుకుంది. సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మదర్ ఆఫ్ ది ఈయర్ అంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ప్రగతి బాటలో మనకు తోడుగా,మన నీడగా, మన అభ్యున్నతిగా దన్నువగా నిలిచే అమ్మలందరికీ ఆదర్శంగా నిలిచింది.

texas

dadelijah

- Advertisement -