`కృష్ణ` నిర్మాత కార్యాల‌యం ప్రారంభించిన త‌ల‌సాని, వినాయ‌క్

600
- Advertisement -

`కృష్ణ` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాతో టాలీవుడ్ కు నిర్మాత‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు కాశీ విశ్వ‌నాధ‌మ్. ర‌వితేజ హీరోగా, మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో `ల‌క్ష్మీ న‌ర‌సింహ విజువ‌ల్స్` ప‌తాకంపై తెర‌కెక్కిన ఈ సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా రిలీజై అప్ప‌ట్లో క‌మ‌ర్శియ‌ల్ గా భారీ విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఎంద‌రో స్టార్ హీరోల సినిమాల‌ను తెలుగు రాష్ర్టాల్లో `శ్రీరామ‌కృష్ణ పిక్చ‌ర్స్` అనే డిస్ర్టీబ్యూష‌న్ సంస్ధ ద్వారా రిలీజ్ చేశారు. రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెర‌కెక్కిన `నాయ‌క్` చిత్రాన్ని గుంటూరు ఏరియా.. గోపీచంద్ హీరోగా రూపొందిన `శంఖం`, నితిన్ న‌టించిన `దిల్` సినిమాలను ఈస్ట్, వెస్ట్ గోదావ‌రి ఏరియాలు డిస్ర్టిబ్యూష‌న్ ఈ సంస్ధ ద్వారానే జ‌రిగింది. ఆ మ‌ధ్య ర‌వితేజ హీరోగా న‌టించిన `కిక్` సినిమాను ప‌లు పంపిణీ సంస్థ‌ల‌తో క‌లిసి డిస్ర్టిబ్యూట్ చేశారు.

అలాగే బాలీవుడ్ మూవీ `హార‌ర్ స్టోరీ` చిత్రాన్ని.. త‌మిళ్ హీరో విజ‌య్ హీరోగా న‌టించిన `త‌లైవా` చిత్రాన్ని తెలుగులో `అన్న‌` పేరుతో అనువ‌దించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించింది ఈ సంస్థ‌నే. తాజాగా ఈ సంస్థ ఓ నూత‌న కార్యాల‌యాన్ని హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలో ప్రారంభించింది. తెలంగాణ సినిమాటో గ్ర‌ఫీ మంత్రి శ్రీ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, స్టార్ డైరెక్ట‌ర్ వి.వి. వినాయ‌క్ చేతుల మీదుగా ఈ కార్యాల‌యం ప్రారంభోత్స‌వం జ‌రిగింది.ఈ సంద‌ర్భంగా అతి త్వ‌ర‌లోనే త‌మ బ్యాన‌ర్ లో కొత్త సినిమా ప్రారంభ‌మ‌వుతుందని నిర్మాత తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాతలు బెల్లంకొండ సురేష్, దాస‌రి కిర‌ణ్ కుమార్, సురేష్ కొండేటి, రైట‌ర్ విస్సు , శేరిలింగం ప‌ల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -