కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోంది..

217
MLA-Balka-Suman
- Advertisement -

అసెంబ్లీ నిర్వహణకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌ వద్ద మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మాట్లాడుతూ.. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గావు కేకలు పెడుతున్నారు. అసెంబ్లీలో పార్టీల బలం బట్టి సమయం కేటాయిస్తారని తెలిపారు. మంగళవారం చర్చలో మాకు 74 నిముషాలు… కాంగ్రెస్ కి 5 రావాలి… కానీ స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి 10 నిముషాలు ఎక్కువగానే కేటాయించారు. టిఆర్ఎస్ తమ గొంతు నొక్కుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల ప్రయత్నం. అసెంబ్లీ స్పీకర్ ను అవమాన పరిచే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళ మాట్లాడారు. మేము స్పీకర్ ను కలుస్తాం…సంఖ్యా బలంను బట్టి సమయం ఇవ్వాలని విన్నవిస్తాం అని సుమన్‌ పేర్కొన్నారు.

ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజా క్షేత్రంలో ప్రజల నుంచి స్పందన లేదు. పరుష పదజాలంతో వారు మాట్లాడం వల్ల వచ్చేది ఏమి లేదు. ఏ అంశంపై అయిన శాసనసభలో చర్చకు సిద్ధం అని కేసీఆర్ ప్రకటించారు. ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ పార్టీ చిల్లర ప్రయత్నం చేస్తోంది. సీఎం కేసీఆర్ పై పరుష పదజాలంతో మాట్లాడటాన్ని ఖండిస్తున్నాము.. మేము అంత కంటే ఎక్కువ మాట్లాడగలం.. మాట్లాడే సత్తా లేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తొండాట ఆడుతున్నారు. మాకు కూడా సభ్యుల సంఖ్య బట్టి స్పీకర్ సమయం కేటాయించారు. సమయం దాటితే అధికార పార్టీ ఎమ్మెల్యేల మైక్ స్పీకర్ కట్ చేశారు అని బల్క సుమన్‌ తెలిపారు. పివికి భారత రత్న రావడం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇష్టం లేదు…తెలంగాణ బిడ్ద పివిని మరుగున పడేశారు…ఆయన ఔన్నత్యాన్ని ప్రపంచంకు చాటి చెప్పే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని బల్క సుమన్‌ అన్నారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే సైది రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురికి మాత్రమే సమయం ఇస్తే …మేము ఎక్కడకు పోవాలి. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి.. కానీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు వద్దు. ఇలా చేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల్లో చులకన అవుతారు అని అన్నారు.

ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ను విమర్శించడం అంటే… తెలంగాణ ప్రజలను అవమానించినట్టే అన్నారు…తెలంగాణలో జనరంజకంగా పాలన సాగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. బీఏసీ సమావేశంలో నిర్ణయించిన సమయం కంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకుఎక్కువ సమయం స్పీకర్ కేటాయించారు. స్పీకర్ ను కలసి సభ్యుల సంఖ్య ఆధారంగా సమయం కేటాయించాలని విన్నవిస్తాం అని తెలిపారు.

ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సభ్యులకు ప్రజా సమస్యలు ప్రస్తావించడం కన్నా పరుష పద జాలం వాడటం పైనే మమకారం ఎక్కువగా ఉన్నట్టుంది. కాంగ్రెస్ చవకబారు రాజకీయాలను సభలో ఎండగడుతామన్నారు. కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు ప్రజల్లో ఆ పార్టీ ని మరింత పలుచన చేస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గర సబ్జెక్టు లేదు.స్పీకర్ ను బ్లాక్ మెయిల్ చేసేలా వ్యవహరించడం కాంగ్రెస్ నేతలు మానుకోవాలి అని అన్నారు.

- Advertisement -