ఐటీపై ప్రత్యేక దృష్టి..

217
- Advertisement -

ఐటీ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. హెచ్‌ఐసీసీలో నిర్వహించిన డేటా అనాలసిస్‌ పాలసీ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. యువత ఉపాధి అవకాశాల కోసం ఐటీ రంగం వైపు చూస్తోందని…వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. ఐటీ రంరంగంలో బిగ్‌ డాటా వేల ఉద్యోగ అవకాశాలను అందిస్తోందన్నారు.

ktr

ప్రభుత్వం ఐటీ రంగంలోని నిపుణులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఐటీ దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌కు తరలి వస్తున్నాయని పేర్కొన్నారు. తయారీ రంగంలో వేలాది ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ఐటీ రంగంలో యువతకు వేలాది ఉద్యోగాలు లభించనున్నాయని పేర్కొన్నారు. రానున్న కాలంలో తెలంగాణ…హైదరాబాద్‌కు కేరాఫ్ గా నిలుస్తుందనని ఆశాభవం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న ఓపెన్ డేటా పాలసీ దేశానికే ఆదర్శం కానుందన్నారు.

- Advertisement -