ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నియోజకవర్గాల వారీగా అభ్యర్థులెవరనేది ఆసక్తికరంగా మారింది. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ బీజేపీ లు ఇంకా తటపటాయిస్తుంటే.. అధికార బిఆర్‌ఎస్ మాత్రం ఆగష్టు లోనే అభ్యర్థులను ప్రకటించి ఎలక్షన్ రేస్ లో దూసుకుపోతుంది. నియోజిక వర్గాల విషయానికొస్తే కాంగ్రెస్ కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న సీట్లు కూడా ఈసారి బిఆర్‌ఎస్ ఖాతాలో చేరేలాగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మునుగోడు బైపోల్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ వశమైంది. ఇక ఇప్పుడు కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కూడా ఈసారి కాంగ్రెస్ కు చెక్ పడబోతుందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ నియోజక వర్గంలో ఎనిమిది సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా , రెండు సార్లు సిపిఐ, మరో రెండు సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించాయి. ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆత్రం సక్కు గెలుపొందారు. అయితే ఆయన ఆ తరువాత హస్తం పార్టీ వీడి బిఆర్‌ఎస్ లో చేరారు. ఈసారి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి కోవలక్ష్మి బరిలో డిగనున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన ఆత్రం సక్కు కూడా బిఆర్‌ఎస్ లోనే ఉండడంతో ఈసారి ఆసిఫాబాద్ లో గులాబీ జెండా ఎగిరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్ నుంచి గాని, బీజేపీ నుంచి గాని ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఆ రెండు పార్టీలను అభ్యర్థుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ఎటు చూసిన ఆసిఫాబాద్ నియోజిక వర్గంలో బిఆర్‌ఎస్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read:జైల్లో చంద్రబాబు.. ప్లాన్ లో వైసీపీ?