ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు రావద్దు

603
- Advertisement -

హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నగరవాసులకు సూచించారు.  ప్ర‌జ‌లు అత్యవసర ప‌రిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సూచించారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా మూసారాంబాగ్ బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. అత్యవసర సేవల కోసం హెల్ప్‌లైన్ నెంబర్ 040-2111 1111 లేదా 100కు సంప్రదించవచ్చని సూచించారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. వరదనీరు రోడ్లపై నిలిచింది. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్‌ఎంసీ అత్యవసర సేవల సిబ్బంది క్షేత్రస్థాయిలో చర్యలకు ఉపక్రమించారు.

2005072617510301

వ‌ర్షాలు కురుస్తోన్న నేప‌థ్యంలో రోడ్ల‌పై ఉన్న‌ మ్యాన్‌హోల్‌లు తెరిచి పెట్ట‌కూడ‌ద‌ని సంబంధిత సిబ్బందికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి  ఆదేశాలు జారీ చేశారు. న‌గ‌ర ప‌రిస్థితిపై స‌మ‌గ్ర‌స్థాయిలో ప‌రిశీల‌న జ‌ర‌పాల‌ని డిప్యూటీ కమిషనర్లు, ఏంఎంహెచ్‌వోలను ఆయ‌న ఆదేశించారు.

download

పంజాగుట్ట ప‌రిస‌ర ప్రాంతాల్లో మోకాళ్ల‌లోతుకి నీరు నిలిచిపోయింది. వాహ‌నాలు న‌త్త‌న‌డ‌క‌న ముందుకు క‌దులుతున్నాయి. పాత‌బ‌స్తీ, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, కోఠీ, దిల్‌సుఖ్‌న‌గ‌ర్, న‌ల్ల‌కుంట, రామాంత‌పూర్‌, ఉప్ప‌ల్‌ ప్రాంతాల్లో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

18HUSSAIN

ఈ ఉదయం హైదరాబాద్ లో కురిసిన కుంభవృష్టికి నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ఒక్కసారిగా నాలుగు అడుగులకు పైగా పెరిగింది. బంజారాహిల్స్, సోమాజిగూడ, బేగంపేట, మెహిదీపట్నం, టోలీచౌకీ, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్ పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు వరదగా మారి హుస్సేన్ సాగర్ లోకి ఒక్కసారిగా వచ్చి చేరడంతో నీటి మట్టం పెరిగింది. దీంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కాలనీల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.  మరో రెండు అడుగుల నీరు చేరితే, గేట్లు తెరిచి మూసీ నదిలోకి నీటిని వదలాల్సి వుంటుంది.  ఇదిలావుండగా, రాజ్ భవన్ సమీపంలో రైలు పట్టాలపై భారీగా నీరు ప్రవహిస్తూ ఉండటంతో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు.

- Advertisement -