నగరంలో అతిపెద్ద వర్షం..

647
- Advertisement -

సుమారు నాలుగు గంటల పాటు భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ నదీ ప్రవాహాన్ని తలపించాయి. పలు చోట్ల ఐదడుగుల మేర నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

31brk41b

గత 15 ఏళ్లలో ఎన్నడూ చూడనంత భారీ వర్షాలు రాబోయే మూడు రోజుల పాటు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే మంగళవారం నుంచి వర్షాలు మొదలయ్యాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి రెండు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. కార్యాలయాలకు, పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవడంతో సమయానికి వెళ్లలేకపోతున్నారు. ఉదయం 9.30గంటలకు మియాపూర్‌లో బయల్దేరిన వారు మధ్యాహ్నం ఒంటిగంటలకు దిల్‌సుఖ్‌నగర్‌ చేరుకోగలిగారంటే వర్షం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

12321313

హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జీహెచ్‌ఎంసీ కమిషనర్, అధికారులతో సీఎస్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ 20 మి.మీ. వర్షపాతాన్ని తట్టుకోగలదని తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లో 60 మిల్లి మీటర్ల వర్షం కురిసిందని స్పష్టం చేశారు. నగరంలో నిలిచిన వరద తగ్గడానికి మరో రెండు గంటల సమయం పడుతుందన్నారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నెం. 040-21111 111 లేదా 100.

14183868_972410789537089_2520644451974820332_n

కుండపోతగా కురుస్తున్న వర్షాలకు నగరంలో ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. రామంతాపూర్‌లో ఓ పురాతన భవనం గోడ కూలడంతో దంపతులు సహా ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మృతులు బాలస్వామి, చిన్నమ్మ, పార్వతి, శ్రీకర్‌గా గుర్తించారు. మృతులు మహబూబ్‌నగర్ జిల్లా చెన్నారం గ్రామానికి చెందిన వలస కూలీలు. అదేవిధంగా ముషీరాబాద్ భోలక్‌పూర్‌లో పాత ఇల్లు కూలిన దుర్ఘటనలో తల్లి సహా ఇద్దరు కూతుళ్లు మృతిచెందారు. మృతులను బిల్‌కిష్(27), మారేనా(3), జబా(5)గా గుర్తించారు.

 

- Advertisement -