ఎన్టీఆర్‌’ఇజం’..!

626
- Advertisement -

జనతా గ్యారేజ్‌ విజయంతో మంచి ఊపు మీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఓ సినిమాకు గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నట్టు సమాచారం. పూరీ జగన్నాథ్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఇజం మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఓ గెస్ట్ పాత్ర పోషించనున్నట్టు సమాచారం. సినిమాలో కథకు అనుగుణంగా ఓ గెస్ట్ పాత్ర ఉండగా ఆ రోల్‌లో ఎన్టీఆర్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ బావిస్తుందట. కళ్యాణ్ రామ్‌తో ఎన్టీఆర్‌కి ఉన్న సాన్నిహిత్యం వలన జూనియర్ కూడా ఓకే అన్నారని చెబుతున్నారు. ఇటీవల విడుదలైన ఇజం టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇంతకు ముందు చింతకాయల రవిలో గెస్ట్‌ కనిపించిన యంగ్‌ టైగర్‌.. కళ్యాణ్‌ రామ్‌ కోసం మరోసారి గెస్ట్‌గా రాబోతున్నాడన్న వార్త ఫిల్మ్‌ నగర్‌లో వినిపిస్తోంది.

కాగా,దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని యూనిట్ భావిస్తోండగా ఇజంలో జగపతి బాబు ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రంపై పూర్తి క్లారిటీ లేకపోయిన త్వరలో 27వ సినిమాను ప్రారంభించాలని యంగ్ టైగర్ భావిస్తున్నట్టు సమాచారం.

ntr isam

 

- Advertisement -