వారు సూర్య-జ్యోతిక. అదేంటి సూర్య.. ఆయన బార్య జ్యోతికను లిఫ్ట్ అడిగాడా.. అన్నట్టుంది ఈ ఫోటో.. అదేం కాదు. ఎప్పుడు షూటింగ్లతో బిజీగా ఉండే సూర్య.. జ్యోతికకు డ్రైవింగ్ పాఠాలు చెబుతూ రోడ్డుపై ఇలా కనిపించాడు. ఇద్దరు సెలబ్రిటీలు ఎవరూ తమను గుర్తు పట్టకుండా హెల్మెట్ పెట్టుకుని బయటకువచ్చారు. జనసంచారం తక్కువగా ఉండే ఉదయం పూట ఆయన ఈ పని పెట్టుకున్నారు.ఐనా, వీళ్లని గుర్తు పట్టి తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఓ నెటిజన్.
బుల్లెట్ నడపడంలో సూర్య ప్రత్యేక క్లాస్ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన సూచనల్ని తప్పకుండా పాటించింది జ్యోతిక. ఇంకేముంది బైకుని నడపడం నేర్చేసుకుంది. సూర్య లాంటి పెద్ద స్టార్ ఇలా తన భార్య కోసం నడిరోడ్డుపైకి రావడం చూసి అంతా షాకయ్యారు. కొందరు ఆయన వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. సూర్య-జ్యోతికలు లవ్లీకపుల్ అంటూ నెటిజన్లు పొగడ్తలు గుప్పించారు.