సుమపై కుట్ర జరుగుతోందా?

587
Anchor suma
Anchor suma
- Advertisement -

తెలుగు బుల్లితెరకు బంగారు నగ సుమ. మాటల మిషన్ గన్. నట జీవితంలో పాతికేళ్ల ప్రస్థానం. పదేళ్ల పాటు యాంకర్ గా నెంబర్ వన్ స్థానం. స్టార్ మహిళగా గిన్నిస్ బుక్ లో చోటు. ఇండ‌స్ట్రీకి ఎంద‌రో యాంకర్‌లు వ‌చ్చారు.. పోయారు. కానీ, ఇప్ప‌టికీ సుమ వెలుగులు మాత్రం అలాగే వెలుగుతున్నాయి. సుమ‌తో పాటు బుల్లితెర‌పై మేక‌ప్ వేసుకున్న ఉద‌య‌భాను, ఝాన్సీ స్లోగా ఫేడ‌వుట్ అయిపోయి ప్యాక‌ప్ చెప్పేయ‌డం కూడా సుమ‌కు క‌లి
సొచ్చింది.

suma kanakala

Anchor suma

క్రికెట్ లో సచిన్ .. తెలుగు యాంకరింగ్ లో సుమ. అమ్మ.. ఆవకాయ.. సుమ యాంకరింగ్.. ఎప్పుడూ బోర్ కొట్టవు.. ఇలా ఎన్ని ఉపమానాలు చెప్పుకున్నా ఆమెకు తక్కువే అవుతుంది. ఆమె 1991లో బుల్లి తెరలో కనిపించారు. 50 సీరియళ్లలో.. కొన్ని సినిమాల్లోనూ నటించారు. ఈ మధ్య “సినీ భస్మాసుర” నాటకంలోనూ లీడ్ రోల్ పోషించి మెప్పించారు.
సీరియళ్ల నుంచి షోలకు..

సుమకు తొలి నాళ్లలో “అవాక్కయ్యారా?”.. “పట్టుకుంటే పట్టు చీర” కార్యక్రమాలు పేరు తీసుకొచ్చాయి. తర్వాత “మహిళలు.. మహారాణులు” సుమని మహిళలకు మరింత దగ్గరి చేశాయి. తర్వాత స్టార్ మహిళ.. తన స్పాంటేనియస్.. కామెడీ పంచ్ లతో రెండు వేల ఎపిసోడ్లు మైలురాయిని ఎప్పుడో దాటేసింది. జీన్స్.. క్యాష్ వంటి షోలు ఆమెకు ఫ్రూట్ జ్యూస్ తాగినంత ఈజీగా ఆమె పూర్తి చేయగలరు.

Anchor suma

ప్రస్తుతం షోలను నడిపించేందుకు నయా యాంకర్లు వచ్చేశారు. అభినయంతో పాటు అందంతో కట్టిపడేస్తున్నారు. మగ ప్రయోక్తల దూకుడు కూడా ఎక్కువగా ఉంది. ఈ మధ్య కాలంలో కమెడియన్లు షోలను ఒంటి చేత్తే నడిపించేస్తున్నారు. దీంతో కొత్త షోలు సుమ వరకు రావడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో క్యాష్, స్టార్ మహిళ మాత్రమే ఉంది. ఈటీవీకి ఆస్థాన యాంకర్ గా పేరు తెచ్చుకున్న సుమకు 20 ఏళ్ల సంబరాలు (జిల్లా స్థాయిలో) ల్లో కూడా అవకాశం దక్కలేదు. మాటీవీలో భలే చాన్సులే గొప్ప కార్యక్రమంగా పేరు తెచ్చుకుంది. ఆ షో తర్వాత మాటీవీలో “కనెక్షన్” అనే షో కు యాంకర్ గా వ్యవహరించారు. ఇది ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. దీంతో సుమను లేటెస్ట్ గేమ్ షోలకు ఎంచుకోవాలా? వద్దా? అని నిర్మాతలు ఆలోచిస్తున్నారు.

Anchor suma

సుమ ఇప్పుడు టీవీల్లో యాంక‌రింగ్‌తోను, ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ల‌తో పాటు, ప‌లు బుల్లితెర కార్య‌క్ర‌మాల‌కు యాంక‌ర్‌గా ప‌నిచేస్తూ నెల‌కు కోట్లలో సంపాదిస్తోంది. అయితే ఇప్పుడు బుల్లితెర మీద సుమ‌ను తొక్కేసేందుకు కుట్ర జ‌రుగుతుంద‌న్న వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. రీసెంట్‌గా ఆమె ఒక్కో షోకి దాదాపు 2.5 ల‌క్ష‌ల నుండి 3 ల‌క్ష‌ల రూపాయ‌లు చార్జ్ చేస్తోంద‌ట‌.
దీంతో ఆమెపై కొంద‌రు నిర్మాత‌లు క‌క్ష క‌ట్టి.. ఆమెపై నెగిటివ్ ప్ర‌చారం చేస్తున్నార‌ట‌. ఆమెను షోల నుంచి త‌ప్పించి ఇప్పుడిప్పుడే రెయిజ్ అవుతున్న వ‌ర్ద‌మాన యాంక‌ర్‌లు అన‌సూయ‌, రేష్మి, శ్రీముఖి, శ్యామల వంటి యాంక‌ర్ల‌ను ప్రోత్స‌హించే ప‌నిలో ప‌డ్డారు కొంద‌రు నిర్మాత‌లు.

Anchor suma

దీంతో, ఆమెపై కావాల‌నే ఒక వ‌ర్గానికి చెందిన నిర్మాత‌లు, బుల్లితెర ద‌ర్శ‌కులు కూడా సుమ ఆధిప‌త్యాన్ని తొక్కేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ఇటీవ‌ల ఝాన్సీకి వచ్చిన కొన్ని షోల‌ని కావాల‌నే సుమ అడ్డుకుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. దీనివెనుక కూడా కొంత‌మంది నిర్మాతలు ఉన్నార‌న్న ప్ర‌చారం ఫిల్మ్‌ న‌గ‌ర్ స‌ర్కిల్స్‌లో జోరందుకుంది.

ఆడియో ఫంక్షన్లు..
ఇది వరకు ప్రతి ఆదివారం ఒక సినిమా ఆడియో ఫంక్షన్. అందులో సుమ యాంకరింగ్. తప్పకుండా ఉండేవి. ఇప్పుడు ఆదివారం ఆడియో ఫంక్షన్ ఉంటోంది. యాంకరే మారుతున్నారు. సుమ చేయాల్సిన కొన్ని ఫంక్షన్ల అవకాశాన్ని శ్యామల అందిపుచ్చుకుంటున్నారు. అనసూయ, లాస్యలు కూడా ఈ చాన్స్ ను అందుకునే వారి జాబితాలో ముందు వరుసలో ఉంటున్నారు.
“యాంకర్ గా సుధీర్ఘ కాలం పాటు సాగడం సుమగారి ఒక్కరికే సాధ్యమైంది. ఆమె అవకాశాలు మాకు వస్తున్న మాట వాస్తవమే. అంత మాత్రాన ఆమె కంటే మేం గొప్ప అనుకోవడం పొరబాటు. యాంకరింగ్ లో ఆమె ఎవరెస్ట్. ఫీల్డ్ లో ఆమె ఉన్నంత కాలం మేం ఉండకపోవచ్చు.” అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక యాంకర్ చెప్పారు.
నేటితరం యాంకర్లతో పోటీ పడుతూ దూసుకుపోతారో.. తను తప్పుకుని నయా యాంకర్లకు దారి ఇస్తారో.. కాలమే తేల్చాలి.

సుమ ఇంకా తాను యువతిననే అనుకుంటోందా? లేక నిత్య యవ్వనంతో వుండే వరం ఏమైనా పొందిందా? అని విమర్శించే వాళ్ళకు ఒక్కటే సమాధానం. సుమ యాంకరింగ్‌లో నిజాయితీ వుంటుంది.. అనేస్తుంది.. అనిపించుకుంటుంది. తేలిగ్గా నవ్వేస్తుంది. మళ్ళీ రెండు సెకెన్లలో కొత్తగా కనిపిస్తుంది. దటీజ్‌ సుమ. అందుకే ఇన్నాళ్ళూ అలాగే వుంది.

- Advertisement -