ఇద్దరి మధ్య ఏం జరిగింది..!

200
cherry koratala
cherry koratala
- Advertisement -

రామ్‌చరణ్‌, కొరటాల కాంబినేషన్ లో రావాల్సిన మూవీ ఆగిపోయిన విషయం తెలిసిందే. దీనికి కారణం చరణ్ స్క్రిప్ట్ పై ఇంట్రెస్ట్ చూపించకపోవడమేనట. కొరటాల కథ చెప్పినప్పుడు చరణ్ అంతగా రెస్పాన్స్ కాలేదట. అయిష్టంగానే కొరటాలతో సినిమా చేయ్యడానికి ఓకే చెప్పాడట చరణ్‌. దీంతో విషయం గ్రహించిన కొరటాల చరణ్‌ తో చర్చించి సినిమాను ఆపేశాడట. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం మాత్రం కన్ఫామ్. అయితే ఎప్పుడు చేస్తామన్నది.. ప్రస్తుతం చెప్పలేనని కొరాటల స్పష్టం చేశాడు.

ప్రస్తుతం కొరటాల శివ జనతాగ్యారేజ్ హిట్ ను ఆస్వాదిస్తున్నాడు. దీని తరువాత జనవరిలో మహేశ్ సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు కొరటాల. ఆ తర్వాత మిర్చి కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. మహేష్‌తో ఓ సినిమా తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తోనూ ఓ సినిమా చేయనున్నాడు కొరటాల. దీని తరువాత చరణ్ తో చేసే అవకాశం ఉంది.

- Advertisement -