చెక్ బౌన్స్ కేసులో తనకు ఏడాది జైలు శిక్ష పడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు సినీ నటుడు,వైసీపీ నేత మోహన్ బాబు. ట్విట్టర్ ద్వారా స్పందించిన మోహన్ బాబు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు తనకు ఏడాది జైలు శిక్ష విధించినట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. పలు టీవీ ఛానళ్లలో తప్పుడు వార్తలు విని..నిరాశకు లోనయ్యానిన తెలిపారు. ప్రస్తుతతం తాను హైదరాబాద్‌లోనే ఉన్నాని ఆ వార్తలను నమ్మవద్దన్నారు.
సలీం అనే మూవీని తెరకెక్కించినందుకు వైవీఎస్ చౌదరికి రూ. 40.50 లక్షల చెక్కును అందించారు మోహన్ బాబు. కానీ ఆ చెక్ బౌన్స్ కావడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. 2010లో కేసు వేయగా 9 సంవత్సరాల తర్వాత తీర్పు వెలవడిందని పలు ఛానళ్లలో వార్తలు ప్రసారం అయ్యాయి. ఏడాది జైలుశిక్షతో పాటు రూ.41.50 లక్షలు చెల్లించాలని తీర్పు వెలువరించినట్లు వార్తలురాగా అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు మోహన్ బాబు.