- Advertisement -
దీపావళి వేడుకలను తనదైన శైలీలో జరుపుకున్నాడు దర్శకుడు రామ్గోపాల్ వర్మ. తల్లి, సోదరితో కలిసి దివాళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్మ సోదరి చిచ్చుబుడ్లు పేలుస్తుండగా.. భయంతో ఆయన తల్లి చాటుకు వెళ్లాడు.
ఈ వీడియోను వర్మ ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. నేను సాధారణంగా చాలా పిరికివాడిని. అందుకే తల్లి వెనుకన దాక్కున్నాను అని పోస్ట్ చేశాడు. దీపావళి సందర్భంగా వాయు,శబ్ధ కాలుష్యానికి నా వంతు సహకారం ఆందిస్తున్నానని వ్యంగ్యంగా చెప్పుకొచ్చాడు. దీపావళి సందర్భంగా వోడ్కా రుచి చూడమని నా తల్లి, సోదరిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నా అంటూ తెలిపాడు.
- Advertisement -