అసలు ఈ హరీష్ ఎవరు?

262
- Advertisement -

తన తీరుతో ఆకట్టుకున్న హరీష్ రావు మంత్రి హరీష్ రావు ఏది చేసినా చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది. పాలమూరు ప్రజల దశాబ్దాల కల నేరవేరుస్తు.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 2,3 లిఫ్టులు మంత్రి హరీష్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకంతో… కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాల్లో లక్షల ఎకరాలు సాగులోకి రానుంది.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రెండో దశను మహబూబ్‌నగర్‌ జిల్లా కోడేరు మండలం జొన్నలబొగుడలో, మూడో దశ ఎత్తిపోతలను నాగర్‌కర్నూలు మండలం గుడిపల్లిగట్టు వద్ద ప్రారంభించి నీరు వదిలిన మంత్రి హ‌రీశ్ రావుకు ఊహించని అనుభ‌వం ఎదురైంది. జొన్నలబొగుడలో రెండో లిఫ్ట్‌ను ప్రారంభించి, గుడిపల్లిగట్టుకు వెళుతున్న మంత్రి హరీశ్‌రావు ఓచోట ఆగి కాలువ ఒడ్డున ఉన్న రైతుతో మాట్లాడారు.

harish-rao

హరీశ్ రావు: అన్నా, ఏం పేరే మీది?
రైతు: నా పేరు నారాయణరెడ్డి, పెద్దకొత్తపల్లి మండలం.
హరీశ్‌: ఇక్కడేం చేస్తున్నరే?
రైతు: మా పొలం ఇక్కడే ఉంది. కాల్వలో నీళ్లు దుంకుతుంటే చూస్తున్నాం.
హరీశ్‌: ఏం ముచ్చటిస్తున్నరు?
రైతు: నైజాం చెర నుంచి బయటపడితే.. ఆంధ్ర, తెలంగాణలను కలిపిండ్రు. ఇన్ని రోజులు ప్రాజెక్టులు పూర్తి కాలే. కేసీఆర్‌ సారొచ్చినంక పనులు సురూ అయినయి. ఇప్పుడు కాల్వల్లో నీళ్లు దుంకుతున్నవి.
హరీశ్‌: సంతోషమేనా?
రైతు: ఇన్నేళ్లకు మా పొలాలకు నీళ్లొస్తంటే సంబరపడుతున్నం

అంతసేపూ మంత్రితో మాట్లాడిన రైతు ‘హరీశ్‌రావు ఎవరే’.. అంటూ ఆయన్నే ప్రశ్నించారు. నేనే అని మంత్రి బదులివ్వడంతో రైతు అవాక్కయ్యారు. ‘ఇప్పటిదాకా నేను మాట్లాడింది ఆయనతోనా’ అంటూ హరీశ్ రావు చేతిలో చెయ్యి క‌లిపారు. చిరునవ్వుతో మంత్రి ముందుకు కదిలారు.

గతంలో పుష్కరాల సమయంలో ట్రాఫిక్ ను క్రమబద్దీకరించిన ఆయన యాగం సందర్భంగాను అదే తీరులో వ్యవహరించారు. యాగ దుస్తులతోను ఆయన ట్రాఫిక్ జామ్ కాకుండా చూడటంలో తన వంతు పాత్ర పోషించారు.

- Advertisement -