పంచె మీద పంచులు

289
- Advertisement -

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సీపీఐ నేత నారాయణ మధ్య పంచెల పంచాయితీ నడుస్తోంది. ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారన్న అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. గతంలో సీపీఐ నారాయణ ‘వెంకయ్యనాయుడు మీటింగులకు వెళ్తే పంచెతో కాదు… ప్యాంటుతో హాజరుకావాలి” అని…. “లేదంటే పంచెలూడదీసి కొడతారు “అని ఎద్దేవా చేశారు. తనపై చేసిన కామెంట్స్ కు గురువారం నాడు కౌంటర్ ఇచ్చారు వెంకయ్య. ఏపీకి ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన వెంకయ్య… అద్భుతమైన ‘పంచె’ పంచ్‌లను పేల్చారు. వెంకయ్యనాయుడును ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టనీయనని ఆ మధ్య ఓ మహానుభావుడు అన్నారని, పంచెలు ఊడదీస్తామన్నారని, అంత ఆసక్తి ఆయనకు ఎందుకు వచ్చిందో అర్థం కాలేదని వెంకయ్య అన్నారు. ఆయనకు పంచెలు లేవా? అని ప్రశ్నించారు.

అంతేగాదు స్వేచ్ఛ ఉందని ఏది పడితే అది మాట్లాడుతున్నారని, ప్రజలు కూడా వారికి పార్లమెంటు, అసెంబ్లీతో బంధాలు లేకుండా స్వేచ్ఛ ఇచ్చారని ఎద్దేవా చేశారు. తాజాగా ఆ వ్యాఖ్యలను తిప్పికొడుతూ మరోసారి వెంకయ్య పంచెపై పడ్డారు సీపీఐ నారాయణ.

Narayana

హోదా విషయంలో వెంకయ్య నాయుడు గురించి తాను కూడా చాలానే ఊహించుకున్నానని చెప్పుకొచ్చిన నారాయణ.. ఆరవ తేదీ అర్థరాత్రి గానీ తనకు అసలు విషయం బోదపడలేదన్నారు. వెంకయ్యలో గానీ వెంకయ్య పంచెలో గానీ ఏమి లేదన్న విషయం ఆరో తేదీ అర్ధరాత్రే తనకు అర్థమైందన్నారు నారాయణ. అప్పుడేమో ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా ఇవ్వాలంటూ ఉడుం పట్టుబట్టిన వెంకయ్య ఇప్పుడు మాత్రం ఊసరవెల్లిలా మారిపోయారని ఆరోపించారు.ప్రత్యేకహోదాపై జిల్లాలన్నీ తిరిగి సన్మానాలు చేయించుకుని , ఇపుడు మాట మారిస్తే అది “నాలుకా తాటిమట్టా ” అంటే యెలావుంటుంది ?” అని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.

గతంలో చిరు ప్రజారాజ్యం ప్రారంభించినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ స్టార్ క్యాంపెయిన్ నిర్వహించారు. తనదైన శైలిలో మాటల తుటాలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఒకడుగు ముందుకేసి కాంగ్రెస్‌ నేతల పంచలుడదీసి కొట్టాలని పిలుపునిచ్చాడు. తర్వాతి కాలంలో ఆ పంచెల పంచనే మెగాస్టార్ చిరంజీవి చేరారు.

- Advertisement -