వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్ ముగిసిన అనంతరం భారత్ జట్టు ఓ టీ20 సిరీస్ ఆడనుంది. ఈ టీ20 సిరీస్‌ను అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమెరికా ఆతిథ్యమివ్వబోయే తొలి అంతర్జాతీయ సిరీస్‌లో ఆడేందుకు భారత్ పరిమిత ఓవర్ల సారథి మహేంద్ర సింగ్ ధోనీ అమెరికా చేరుకున్నాడు. ధోనీతోపాటు బుమ్రా కూడా అమెరికా వెళ్లాడు. ఈ నెల 27, 28న భారత్-వెస్టిండీస్ మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఫ్లోరిడాలోని లాడర్ హిల్‌లో వరుసగా రెండు రోజుల్లో రెండు టీ20లు జరగనున్నాయి. ఈ క్రికెట్ స్టేడియంలో 40శాతం వరకే స్టాండ్స్ ఉంటాయి. మిగతా 60శాతం ఖాళీగా ఉంటుంది. తొలిసారి అమెరికాలో జరగబోతున్న అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి మరి. విరాట్ కోహ్లి నేతృత్వంలో భారత సేన 2-0తేడాతో వెస్టిండీస్‌పై సిరీస్ గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న టెస్టు జట్టులోని 15 మంది సభ్యుల్లో 8 మంది టీ20 ఆటగాళ్లు కూడా ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. కాగా, విరాట్ సేన కూడా వెస్టీండిస్ నుండి అమెరికా బయలుదేరి వెళ్లారు.