అతని శరీరమే ఓ అయస్కాంతం

254
arun
arun
- Advertisement -

ఆయన బాడీపై అయిదు కేజీల బరువు గల ఐరన్ బాక్సులు పెట్టినా జారీపోవు.  ఆయన శరీరానికి స్పూన్లు, ఇనుప మేకులు అతుక్కుపోతాయి.  తనకున్న వింత ప్రతిభతో జనాల్లో పాపులర్ అయ్యాడు మధ్య ప్రదేశ్‌కు చెందిన 37 ఏళ్ల అరుణ్‌. ఆయన శరీరంలో అయస్కాంత తరంగాలు ఉండడమే దీనికి కారణం.

వృత్తి రిత్యా ఫోటోగ్రాఫర్‌ అయిన అరుణ్‌కు కొద్ది నెలల కిందటి వరకు తనలో ఈ శక్తి ఉన్నదని తెలియదు. కొద్ది నెలల క్రితం ఇంట్లో నట్లు, హామర్‌తో టేబుల్‌ ఫిక్స్ చేస్తుండగా.. ఇనుప వస్తువులు ఆయన శరీరానికి అతుక్కుపోవడం గమనించాడు. ఇది ఎలా జరిగిందో తనకు తెలియదన్నాడు అరుణ్.. దీని గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదనుకున్నాడు. అయితే తనలో ఉన్న ఈ వింతను చూడ్డానికి చాలా మంది వస్తున్నపుడు  భయపడ్డా ఇపుడు ఇది అలవాటైందని చెప్పాడు.

magnet-man-story

అయితే అరుణ్‌ బాడీకి మెటల్స్‌ అతుక్కుపోవడం చూసి డాక్టర్లు షాకయ్యారు. అయితే అరుణ్ కేసును డీల్ చేస్తున్న డాక్టర్‌ శైలేంద్ర శుక్లా మాత్రం భయపడాల్సింది ఏం లేదన్నారు. ప్రతి మనిషి శరీరంలో కొంత అయస్కాంతత్వం ఉంటుందని.. అది అరుణ్ శరీరంలో ఎక్కువగా ఉందని అన్నారు. అయితే వీటి వల్ల అరుణ్ శరీరానికి ఎలాంటి ప్రమాదం లేదని వారు పేర్కోన్నారు. ఎక్కువ అయస్కాంత తరంగాలు ఛాతీ.. పొట్ట.. వెనుకభాగం..లో వస్తున్నాయి. కొంతకాలం తర్వాత మాగ్నటిక్ పవర్ వంట్లో నుంచి పోతుందని వారు చెప్పారు. ఇక మనిషి శరీరంలో ఉన్నా అయస్కాంత తరంగాల వల్లే ఎంఆర్‌ఐ.. ఈసీజీ స్కానింగ్‌లు తీయగల్గుతున్నారు. ఇలా చిన్న వస్తువులతో మొదలుపెట్టిన అతని బాడీ ఇప్పుడు అయిదు కేజీల బరువు గల ఐరన్ బాక్సులు కూడా అతుక్కుపోతుండటంతో జనమంతా అరుణ్‌ను వింతగా చూస్తున్నారు. ఇక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (ఇండియా వెర్షన్) వాళ్లు అతని విన్యాసాల వీడియో ఫుటేజి తమకు పంపమంటూ లేఖలు రాశారట.

https://youtu.be/f6qDMesHvVU

- Advertisement -