దుబ్బాకలో బీజేపీ బాగోతం బట్టబయలు.. వీడియో

125
Raghunandan

దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువు అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షల నగదును సిద్దిపేట పోలీసులు సోమ‌వారం మ‌ధ్యాహ్నం స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే సాయంత్రం 4.30 గంటల సమయంలో సీజ్‌ చేసిన డబ్బు సంచిని అధికారులు బయటకు తీసుకొస్తుండగా.. సుమారు 30 మంది బీజేపీ కార్యకర్తలు దూసుకొచ్చి దానిని లాక్కొన్నారు. ఆ సంచిలో నుంచి డబ్బును గుంజుకొని.. వాటిని చూపుతూ పారిపోయారు. సీజ్‌ చేసిన రూ.18.67 లక్షల్లో బీజేపీ కార్యకర్తలు రూ.12.87 లక్షలు ఎత్తుకెళ్లారు.

సోదాల్లో దొరికిన రూ.18.67 లక్షలను రఘునందన్‌రావు సమీప బంధువు జితేందర్‌రావు పంపినట్టు నిందితుడు అంజన్‌ రావు ఒప్పుకొన్నారని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ పేర్కొన్నారు. ఈ డబ్బును కొద్దికొద్దిగా దుబ్బాకకు చేర్చేలా వారు ప్రణాళిక రచించినట్టు చెప్పారు. సిద్దిపేటలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువు అంజ‌న్‌రావు ఇంట్లో న‌గ‌దును సీజ్ చేసిన వీడియోల‌ను పోలీసు క‌మిష‌న‌ర్ జోయల్ డేవిస్ మంగ‌ళ‌వారం ఉద‌యం విడుదల చేశారు. దీంతో దుబ్బాకలో నిన్నటి నుండి బీజేపీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం ఆడుతున్న డ్రామా బట్టబయలు అయ్యింది. “ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే” అని ఈ వీడియోతో నిరూపితమైంది.