హ్యాపి బర్త్ డే టు అమల

651
Akkineni Amala Birthday
Akkineni Amala Birthday
- Advertisement -

భరత నాట్యంలో డిగ్రీ చేసి గ్లామర్‌ ప్రపంచంలోకి అడుగిడి నటిగా, భరతనాట్య కళాకారిణిగా ఆ తర్వాత వన్యప్రాణి సంరక్షకురాలిగా భిన్న రంగాల్లో రాణిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు అక్కినేని అమల. ప్రస్తుతం ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటు స్ఫూర్తిగా నిలుస్తున్న అక్కినేని అమల పుట్టిన రోజు నేడు.

Akkineni Amala Birthday

అమల కలకత్తాలో జన్మించారు. అమల నాన్న బెంగాలీ, అమ్మ ఐరీష్‌. – చెన్నైలోని కళాక్షేత్రం నుంచి భరతనాట్యంలో డిగ్రీ పొందారు. విదేశాల్లోనూ పలు భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలతోపాటు పలు అవార్డుల్ని సొంతం చేసుకున్నారు.
– తమిళంలో టి. రాజేందర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మైతిలి ఎన్నై కాథలి’ అనే చిత్రం ద్వారా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.
– నాగార్జున సరసన నటించిన ‘కిరాయి దాదా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.

Akkineni Amala Birthday

‘శివ’ చిత్ర సమయంలో నాగార్జునతో ఏర్పడిన ప్రేమ కాస్త పెళ్ళికి దారి తీసింది. అక్కినేని నాగార్జున, అమల వారసుడు అక్కినేని అఖిల్‌.
– అమల హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషల్లో దాదాపు యాభైకి పైగా చిత్రాల్లో నటించారు. ఇటీవల ఆమె ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ చిత్రంలో నటించారు. – తెలుగులో నాగార్జున, తమిళంలో ప్రభుకి జోడీగా ఎక్కువ చిత్రాల్లో నటించారు. నాగార్జునతో నటించిన చిత్రాల్లో అమలకు బాగా నచ్చిన చిత్రం ‘శివ’.

 

Akkineni Amala Birthday

కళ కల కోసం కాదు.. లోక కళ్యాణం కోసం అన్న మాటను తూచ తప్పకుండా పాటిస్తారు అక్కినేని అమల. నటిగా, గృహిణిగా, సంఘ సేవకురాలిగా అమల తనదైన పంథాలో పయనిస్తారు. భర్త నాగార్జునతో ప్రేమ వివాహం చేసుకున్న అమలు అక్కేనేని కుటుంబంలో క్వీన్‌. భార్యగా, తల్లిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే మూగజీవాల సంరక్షణకు నడుం బిగించారు అమల. తన భర్త నాగార్జున సహకారంతో అమల నెలకొల్పిన బ్లూక్లాస్‌ సంస్థ ఎన్నో మూగ జీవాల ఆవేదనను అర్ధం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తన పనుల్లో తానెంత బిజీగా ఉన్న తనకు తగ్గ పాత్రలు లభిస్తే నటిస్తూనే ఉంది.

Akkineni Amala Birthday

వంగ దేశంలో పుట్టిన దక్షిణాది తారగా తనదైన బాణీ పలికించారు అమల. అనేక తమిళ చిత్రాల్లో తారగా వెలుగొందిన అమల నాగార్జునతో జోడి కట్టి హిట్‌ పేయిర్‌ గా నిలిచారు. వీరిద్దరు నటించిన కిరాయి దాదా, శివ, నిర్ణయం, చినబాబు, ప్రేమయుద్ధం చిత్రాలు ఆకట్టుకున్నాయి. వీరిద్దరి కలల పంటగా జన్మించిన అఖిల్‌ కూడా చిన్నవయసులోనే సిసింద్రిగా మెప్పించాడు. ఇప్పుడు ఈయన కూడా తన తల్లిదండ్రుల మాదిరిగానే ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. అఖిల్‌ ప్రేమ వ్యవహారం ఈ మద్యనే బయటపడింది. అఖిల్‌ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడనే వార్తలు ఈ మద్య బాగానే వినిపిస్తున్నాయి. అటు నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య కూడా త్వరలోనే ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడనే వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది. ప్రముఖ హీరోయిన్‌ సమంతను నాగచైతన్య వివాహం చేసుకోబోతున్నాడు. ఈ మద్యనే వీరి పెళ్లికి అక్కినేని కుటుంబం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. త్వరలోనే ఈ అక్కినేని వారసుల వివాహాలు జరుగనున్నాయి.

Akkineni Amala Birthday

అక్కినేని అమల మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఆమె పుట్టిన రోజు సందర్భంగా అమలకు మరోసారి గ్రేట్‌ తెలంగాణ. కామ్‌ తరుపున జన్మదిన శుభాకాంక్షలు.

- Advertisement -