రియల్ ఎస్టేట్ లోకి సమంత…

777
heroine samantha
heroine samantha
- Advertisement -

శ‌ర‌వేగంగా స్టార్ హీరోయిన్ అనిపించుకొన్న క‌థానాయిక‌ల్లో స‌మంత ఒక‌రు. ఆమె ఏ ముహూర్తాన తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిందో కానీ.. తొలి సినిమాతోనే ప్రేక్ష‌కుల్ని మాయ ప‌డేసింది. రెండో సినిమాతోనే స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. అప్ప‌ట్నుంచి వెన‌క్కి తిరిగి చూసిందే లేదు.సినిమా స‌క్సెస్ ఫెయిల్యూర్ల‌తో సంబంధం లేకుండా ఆమె త‌న స్టార్‌ స్టేటస్‌ ని కొన‌సాగిస్తోంది. నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా చ‌లామ‌ణీ అవుతోంది.

heroine samantha

ఒక ప‌క్క సినిమా అవ‌కాశాల‌తో పాటు, మ‌రోప‌క్క ఎండార్స్‌ మెంట్ల‌తో దుమ్ము దులిపేస్తోంది. అయితే కాస్మొటిక్స్‌, చెప్పులు, వ‌స్త్ర దుకాణాల‌కి సంబంధించిన ఎండార్స్‌మెంట్ల‌లోనే ఎక్కువ‌గా క‌నిపించిన స‌మంత తాజాగా రియ‌ల్ ఎస్టేట్ రంగంలోకి కూడా దిగింది. నెలకొక కొత్త ప్రాజెక్టు అయినా ఆమె చేతికి అందుతుండడంతో రెండు చేతులా సంపాదిస్తోంది. అయితే ఇటీవల ఆమె దృష్టి రియల్‌ ఎస్టేట్‌ రంగంపైనా పడినట్టు తెలుస్తోంది.

heroine samantha

రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకి కథానాయికలు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరించడం అరుదు. కానీ సమంతకి ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఆమెని ఆమెని ఓ సంస్థ సంప్రదించింది. తిరుప‌తి కేంద్రంగా న‌డుస్తున్న ఆ  కంపెనీకి ప్ర‌చార క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. నిన్న ఓ ఈవెంట్‌లో పాల్గొని రియ‌ల్ ఎస్టేట్ కంపెనీకి ప్ర‌చారం చేసింది.  ఇలాంటివి రెండు మూడు క్లిక్కయ్యాయంటే ఇక సమంత రియల్‌ రంగంలోనూ ఎండార్స్‌ మెంట్లతో దూసుకుపోవడం ఖాయమని చెప్పొచ్చు.

- Advertisement -