స్వచ్చ భారత్‌ మస్కట్‌.. ఈ బామ్మ

248
kunwar bhai
kunwar bhai
- Advertisement -

ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు పెంచుకున్న గొర్లను అమ్మిన బామ్మను స్వచ్చభారత్‌ మస్కట్‌గా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంపిక చేసింది. సెప్టెంబర్‌ 17న ‘స్వచ్ఛ దివస్‌’ సందర్భంగా దిల్లీలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని చేతులమీదుగా ఆమెను సత్కరించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు లేటు వయసులో కూడా మరుగుదొడ్డి నిర్మించుకుంది 105 ఏళ్ల కున్వర్ బాయి. గతంలో శ్యాంప్రసాద్‌ ముఖర్జీ రూర్బన్‌ మిషన్‌ను ప్రారంభించేందుకు ఛత్తిస్‌గఢ్‌ వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ ఆమె గురించి తెలుసుకుని అభినందించడమే కాక ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు.

కున్వర్‌ బాయి.. తన ఇంట్లో రెండు మరుగుదొడ్లను నిర్మించేందుకు 10 గొర్రెలను అమ్మింది. అంతే కాకుండా తాను నిర్మించుకున్న దొడ్లను గ్రామస్తులకు కూడా చూపించి దొడ్ల ప్రాముఖ్యతను వివరించింది.

 

- Advertisement -