సెప్టెంబ‌ర్ 9న ‘జ్యో అచ్యుతానంద’

421

నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్ర హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం `జ్యో అచ్యుతానంద`. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 9న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

ఈ సంద‌ర్భంగా …చిత్ర ద‌ర్శ‌కుడు అవ‌స‌రాల శ్రీనివాస్ మాట్లాడుతూ “నారారోహిత్‌, నాగ‌శౌర్య‌, రెజీనాల మ‌ధ్య జ‌రిగే క్యూట్ ఫ్యామిలీ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్‌. ట్రైల‌ర్ చూసిన‌వారు అచ్యుత్ గా నారా రోహిత్‌, ఆనంద్‌గా నాగ‌శౌర్య‌ల మధ్య కెమిస్ట్రీ బాగా ఉందని మెచ్చుకున్నారు. ముగ్గురు వ్య‌క్తుల మ‌ధ్య జ‌రిగే సున్నిత‌మైన క‌థాంశం. ఎమోష‌న్స్‌, ఎంట‌ర్‌టైన్మెంట్ క‌ల‌గ‌లిసి ఉంటుంది. అలాగే నా ద‌ర్శ‌క‌త్వంలో గ‌తంలో వ‌చ్చిన ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమాకు భిన్నంగా ఉండే సినిమా. ప్ర‌తి సీన్ ఎగ్జ‌యిటింగ్‌గా అనిపిస్తుంది. క‌ల్యాణ్ ర‌మ‌ణ గారు ఎక్స‌లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. పాట‌లు బావున్నాయని అంద‌రూ అప్రిసియేట్ చేస్తున్నారు. అలాగే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు కూడా చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది“ అన్నారు.

వారాహిచ‌ల‌న చిత్రం అధినేత సాయికొర్ర‌పాటి మాట్లాడుతూ “మా బ్యాన‌ర్‌లో రూపొందిన ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ జ్యో అచ్యుతానంద‌. సినిమా చూస్తున్నంత సేపు ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న డిఫ‌రెంట్ మూవీ. సినిమాకు సంబంధించిన సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వ‌ర‌ల్డ్ వైడ్‌గా సెప్టెంబ‌ర్ 9న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు