సిస్కోతో డిజిటల్ తెలంగాణ

318
- Advertisement -

తెలంగాణను డిజిటల్ రాష్ట్రంగా మార్చడానికి సిస్కోతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. జీడీపీ వృద్ధి ,ఉపాధి కల్పన, ఆవిష్కరణలు వేగవంతం చేయడం, విద్య వృద్ధి, వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, వ్యాపార ఆవిష్కరణలు వేగవంతం చేయడంతో పాటు మౌలిక వసతులకు సిస్కో సహకారం అందజేయనుంది.ఈ దిశగా, సిస్కోమరియు తెలంగాణా రాష్ట్రప్రభుత్వాలు ఓ అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకాలు చేశాయి. దీనిలో భాగంగా హైదరాబాద్లో డిజిటల్ జోన్ స్మార్ట్ ప్రాజెక్ట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు మరియు హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో లివింగ్ ల్యాబ్ ఏర్పాటుచేయడం, వ్యవస్థాపకతను ప్రోత్సహిసూ భారతదేశంలో అంకితం చేయబడ్డ అతిపెద్ద భవంతి టీ-హబ్ ప్రాంగణంలో సెంటర్ఆఫ్ ఎక్స్లె లెన్స్ మరియు లివింగ్ ల్యాబ్ ఏర్పాటు, కరీంనగర్లోని 10 పాఠశాలల్లో రిమోట్ ఎడ్యుకేషన్ మరియు హైదరాబాద్లోని చారిత్రాత్మక కట్టడమైన కుతుబ్ షాహీ టూంట్స్ అభివృద్ధి ఎంఓయులో ఉన్నాయి.

సిస్కో మరియు తెలంగాణా ప్రభుత్వం నడుమ ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు నేడు హైదరాబాద్లోని హైటెక్సిటీ వద్ద జరిగిన ఐటీ సెక్టోరల్ పాలసీఆవిష్కరణకార్యక్రమంలో జరిగాయి. రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కేటీఆర్,ఇతర ప్రభుత్వఉన్నతాధికారులు మరియు సిస్కో అధ్యక్షులు దినేష్ మల్కానీ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.

గోల్డెన్ మైల్ ప్రాజెక్ట్‌లో భాగంగా, సిస్కో ఇప్పుడు సిటీ డిజిటల్ ప్లాట్‌ ఫామ్ (సీడీపీ)ను హైదరాబాద్లోని హైటెక్స్‌ సిటీ వద్ద 2.2 కిలోమీటర్ల ప్రాంతంలో ఏర్పాటుచేయబోతుంది. దీనిలో స్మార్ట్ వై-ఫై సార్ట్ పార్కింగ్ స్మార్ట్ లైటెనింగ్ కీలక జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఎనలిటిక్స్ ప్రభుత్వ సేవల ఆర్ఈజీఎస్, స్మార్ట్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. వీటితో అత్యుత్తమ సామర్థ్యం మరియు ప్రభావంతంగా నగరాన్ని పర్యవేక్షించి నిర్వహించడం చేస్తారు.

డిజిటల్ జోన్ ప్రాజెక్ట్‌లో భాగంగా సిస్కో తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా నగర సేవల కొరకు ప్రభావంతమైన స్కేలబుల్ నమూనాలను నిర్మించేందుకు స్థానిక ఎకోసిస్టమ్ సొల్యూషన్ భాగస్వామ్యం ఏర్పరుచుకుని పనిచేస్తుంది. ప్రత్యేకంగా భారతీయ స్మార్ట్ నగరాల కొరకు నూతన అప్లికేషన్లను అభివృద్ధి చేసేందుకు ఎకో సిస్టమ్ భాగస్వాములతో సిస్కో అనుసంధానించబడడంతో పాటుగా తెలంగాణాలో రాబోయే స్మార్ట్ నగరాల కొరకు సహాయపడుతుంది.

సిస్కో ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (సీఓఈ) మరియు లివింగ్ ల్యాబ్ ను టీ-హబ్ ప్రాంగణంలో ఏర్పాటుచేయనుంది. దీనిద్వారా స్థానిక ఆవిష్కరణలను పెంచడంతో పాటుగా ఐఓటీ మరియు సైబర్ సెక్యూరిటీలో స్టార్టప్స్‌, భాగస్వాములు పరిష్కారాలను కనుగొనేందుకు తగిన వాతావరణం కల్పిస్తూనే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లో నిమగ్నమయ్యేలా చేస్తుంది. ఇది స్టార్టమ్స్, యాక్స్‌లేటర్స్ డెవలపర్లు, రీసెర్చర్లు, ఎకో సిస్టమ్ పార్టనర్స్ మరియు వెంచర్ కమ్యూనిటీ ఒకే తాటిపైకి వచ్చి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అవకాశాలను ప్రదర్శించడానికి కూడా ఓ వేదికగా నిలుస్తుంది.సిస్కో తమ గ్లోబల్ స్మార్ట్ సిటీస్ ప్లాట్‌ ఫామ్ సిటీ డిజిటల్ ప్లాట్ ఫామ్ (సీడీపీ)ను ప్రదర్శించనుంది. ఇది పలు స్మార్ట్ సిటీ సేవలను సిస్కో కొలాబరేషన్ సొల్యూషన్స్ మరియు సిస్కో మొబిలిటీ సర్వీసెస్ ఇంజిన్తో పాటుగా యునిఫైడ్ ప్లాట్‌ ఫామ్‌ పై అనుసంధానించనుంది.

సిస్కో సీఓఈ ను టీ-హబ్లోని ఐఐఐటీ క్యాంపస్‌లో ఏర్పాటుచేయనున్నారు. ఇది కాటలిస్ట్గా పిలువబడే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ T0వేల చదరపు అడుగుల భవంతిలో భాగం. భారతదేశంలో వ్యవస్థాపకత కొరకు పూర్తిగా అంకితం చేయబడ్డ అతిపెద్ద భవంతి ఇది. టీ-హబ్ మిషన్ లక్ష్యం. ప్రపంచంలో స్టార్టప్ కమ్యూనిటీలలో ఒకటిగా హైదరాబాద్‌ను వృద్ధి చెందేలా చేయడం. తెలంగాణాలో మారుమూల ప్రాంతాలకు సైతం నాణ్యమైనవిధ్య అందించడం,తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వలక్ష్యం, రాష్ట్రంలోని విద్యార్థులందరికీ అత్యుత్తమ విద్య, ప్రతిపాఠశాలలోనూ అత్యుత్తమ ఫ్యాకల్టీను తీసుకురావడం. ఈ దిశలో భాగంగా ప్రభుత్వం సిస్కోతో భాగస్వామ్యం చేసుకుంది.

తెలంగాణ రాష్ట్ర డిజిటల్ బూ ప్రింట్లో భాగంగా, రాష్ట్రంలో స్మార్ట్ సిటీ మౌలిక వసతులు అభివృద్ధి చేయడానికి సిస్కో ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా భవిష్యత్లో డిజిటల్ రాష్ట్రంగా తెలంగాణను మార్పు చేయడానికి తోడ్పడనుంది. హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వారసత్వ కట్టడం – గోల్కండకు అతి సమీపంలోని కుతుబ్షాహీ టూంట్స్‌ ను సిస్కో డిజిటైజ్ చేయనుంది. కుతుబ్షాహీ టూంట్స్ సందర్శకుల అనుభవాలను మరింత వృద్ధి చేసేందుకు డిజిటల్ పరిష్కారాలను చూపనుంది. తద్వారా రాష్ట్రంలో పర్యాటకాన్ని కూడా వృద్ధి చేయనుంది. పబ్లిక్ వై-ఫై నిఘా, స్మార్ట్ లైటెనింగ్ మరియు స్మార్ట్ పార్కింగ్ పరిష్కారాలును సందర్శకులు, పౌరులకొరకు ఏర్పాటుచేయడంతో ఆ ప్రదేశంలోని ప్రతి కట్టడం వివరాలను అందించనుంది.

భౌగోళికంగా ఉన్నటువంటి అవకాశాలతో పాటుగా దీని సంస్కృతి, అనుకూలమైన వాతావరణం, అత్యద్భుతమైన కనెక్టివిటీ, మౌలిక వసతులు,రాష్ట్రాన్నిడిజిటల్ రాష్ట్రంగా మార్చాలనే ప్రభుత్వం యొక్క దూరదృష్టి, అందుకు తగిన రీతిలో పరిశ్రమకు సహాయమందించడానికి ప్రారంభించిన కార్యక్రమాలు వంటివాటి కారణంగా ఇన్వెస్టర్లు హైదరాబాద్ పట్ల ఆసక్తిచూపుతున్నారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ను ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఐటీ కేంద్రంగా మార్చడంతో పాటుగా తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా దీనిని విస్తరించాలన్నది మా లక్ష్యమని అన్నారు.

ktr

రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ డిజిటల్‌గా సమృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ద్వారా ప్రజలజీవనప్రమాణాలు వృద్ధి చెందడంతో పాటుగా ఆర్థిక పోటీతత్వం పెరిగి, స్థానిక ఆవిష్కరణలు వేగవంతం కావడంతో పాటుగా దేశానికి నాలెడ్జ్, టెక్నాలజీ హబ్‌గా మారుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్ కొరకు సిస్కోతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేం చాలా సంతోషంగా ఉన్నాం. సిస్కో యొక్క అంతర్జాతీయ అనుభవం మరియు డిజిటైజేషన్‌లో దీని నైపుణ్యం తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా ప్రయోజనం కలిగించడంతోపాటుగా డిజిటల్ విప్లవంలో రాష్ట్రాన్ని ముందడుగులో ఉండేటట్లు చేస్తుంది” అని అన్నారు.

సిస్కో అధ్యక్షులు దినేష్ మల్కానీ, మాట్లాడుతూ ఏ విధంగా నగరాలు, కమ్యూనిటీలు మరియు దేశాలు అంతర్జాతీయ పోటీతత్వం నిర్వహిస్తున్నాయన్నదానితో పాటుగా జీడీపీ వృ ద్ది, ఆవిష్కరణలు పెంచడం, నూతన ఉపాధి అవకాశాలు సృష్టించడానికి డిజిటైజేషన్ అత్యంత కీలకమన్నారు, తెలంగాణను డిజిటల్ రాష్ట్రంగా మార్చాలన్న తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం – రాష్ట్రానికి భారీ అవకాశాలు తీసుకురావడంతోపాటుగా రాష్ట్ర ప్రజలు, దేశానికి కూడా అవకాశాలను తీసుకువస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేం చాలా ఆనందంగా ఉన్నాం మరియు భారతదేశంలో వాస్తవంగా డిజిటల్ రాష్ట్రంగా తెలంగాణను మార్చడంలో సహాయపడడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

- Advertisement -