సినీ కార్మికుల ఇళ్లకే నిత్యావసర సరుకులు…

139
chiranjeevi

సినీ కార్మికుల ఇళ్లకే నిత్యావసర సరుకులు పంపిణీ చేసే ప్రక్రియ మొదలైందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ట్విట్టర్‌లో వీడియోను షేర్ చేసిన చిరు…కార్మికుల ఇంటికే నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తామని వెల్లడించారు.

ఉగాది నుండి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న చిరు..లాక్ డౌన్ కారణంగా ఉపాధి కొల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ)ని ఏర్పాటు చేశారు. పలువురు హీరోలు,హీరోయిన్లు,నిర్మాతలు ఇప్పటికే సీసీసీకి విరాళాన్ని అందించారు. ఈ నిధులతో సినీ కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు.