సల్లుభాయి.. పెళ్లి చేసుకుంటాడా ?

258
salman khan
salman khan

సల్మాన్ ఖాన్ బ్రహ్మచర్యానికి ఈ ఏడాది చివర్లో పులిస్టాప్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. సల్మాన్ పెళ్లి విషయంలో ఎవరి ఊహకు అందని విధంగా వ్యవహరిస్తున్నాడు. దీనికి తోడు ఎప్పటికప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ ను మార్చడంతో, కండలవీరుడు ఇక లైఫ్ లాంగ్ ఇలాగే కంటిన్యూ అవుతాడేమో అని చాలామంది అనుకున్నారు. అయితే కొత్త గర్లఫ్రెండ్ ఫారిన్ లేడీ లులియా వాంటూర్ ను సల్మాన్ పెళ్లి చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.ఇటీవల సల్మాన్ ఎక్కడికి వెళ్లినా అతడితో కలిసి లులియా వెళుతుండటం పెళ్లి విషయాన్ని కన్ఫామ్ చేస్తున్నాయి.ఈ ఇయర్ ఎండింగ్ లోనే పెళ్లి కావడం ఖాయమని సల్మాన్ సన్నిహితులు కూడా చెబుతున్నారు. ఇక ఇటీవల సల్మాన్ ఖాన్ తన తల్లిదండ్రులను వదిలి కొత్త ఇంట్లోకి మారాలని డిసైడ్ కావడం.. పెళ్లి వార్తలకు మరింత బలాన్నిచ్చింది. అయితే సల్మాన్ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడా లేదా అంటే మాత్రం సమాధానం ఎవరివద్దా లేదనే చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతుందో.