సమంతపై ఎన్టీఆర్ ఫైర్

636
NTR Fires on Samantha in Janatha Garage Movie Promotions
NTR Fires on Samantha in Janatha Garage Movie Promotions
- Advertisement -

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంతపై తారక్ ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు. అయితే ఇది సినిమాలో కాదు… నిజంగానే.. ఇంతకు సమంతపై తారక్‌కు ఎందుకు కోపం వచ్చింది… సమంత ఏం చేసింది… తారక్‌ కోపానికి గల కారణం ఏమిటంటే.. కొరటాల శివ – తారక్ ల సెన్సేషనల్ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజీ ప్రమోషన్స్ లో భాగంగా అన్ని టీవీల్లోనూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ టీవీలో లైవ్ షో ద్వారా ఇంటర్వ్యూ ఇవ్వాలని తారక్ – కొరటాల సిద్ధమయ్యారు.

దీంతో మూవీలో తారక్ సరసన హీరోయిన్ గా నటించిన సమంతని కూడా ఇన్వైట్ చేశారు. సరిగ్గా లైవ్ షోకి టైం కల్లా అటెండైపోయాడు తారక్. డైరెక్టర్ కొరటాల కూడా టైంకే వెళ్లిపోయాడు. కానీ సమంత మాత్రం.. సమయానికి స్టూడియోకి చేరుకోలేదు. . పోనీలే మేకప్ వేసుకోవడానికి కాస్త టైం పడుతుందేమో అని తారక్ అనుకున్నాడు. అలా 15 నిమిషాలు వెయిట్ చేశాడు. అయినా సమంత రాలేదు. ఏకంగా 30నిమిషాలు వెయిట్ చేశాడు. అయినా కూడా సమంత రాలేదు. అప్పటికీ ఓపిగ్గా మరో 15 నిమిషాలు చూశాడు. కానీ సమంత రాలేదు.

వెళ్లిపోదామని ఫిక్స్ అయ్యాడు. సరిగ్గా అప్పుడే సమంత వచ్చింది. సమంతను చూసిన వెంటనే తారక్ కు కోపం న‌షాళానికి అంటింది. ఆమెను చూడ‌గానే ఒక్క‌సారిగా ఫైర్ అవ్వ‌బోయాడు. లేచి వెళ్లిపోబోయాడు. ఇంత‌లోనే సారీ చెప్పిన స‌మంత‌.. త‌న లేట్‌కి రీజ‌న్‌కూడా చెప్ప‌డంతో అప్ప‌ట‌కీ గాని మ‌నోడు కాస్త కూల్ అవ్వ‌లేదు.
తాను ఓ ఛారిటీ కార్యక్రమం వల్లనే లేట్ అయిందని సమంత చెప్పడంతో ఎన్టీఆర్ కాస్త కూల్ అయ్యి ఇంట‌ర్వ్యూలో కూర్చున్నాడ‌ట‌. అది అస‌లు సంగ‌తి.

- Advertisement -