వీళ్లది ఆలూ సమోసాల బంధం

160
Samantha Dubbing Artist-Singer Chinmayi
Samantha Dubbing Artist-Singer Chinmayi

తెలుగులో సమంత అందానికి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో… ఆమె గొంతుకి కూడా అంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. చిన్న జీరతో పలికే ఆ గొంతు కుర్రాళ్లకి మత్తెక్కించేలా ఉంటుంది. అలాగని ఆ గొంతు సమంత సొంతానిది కాదు. గాయని చిన్మయి శ్రీపాదది. తొలి చిత్రం ‘ఏమాయ చేసావె‘ నుంచి సమంతకి చిన్మయినే డబ్బింగ్‍ చెబుతోంది. అందాల రాక్షసి ,అలా ఎలా లాంటి సిని మాల్లో నటించిన కథానాయకుడు రాహుల్‍ రవీంద్రన్‍ భార్యే చిన్మయి.

గాయనిగా మాంచి ఫేమసు. కోలీవుడ్‍ నుంచి బాలీవుడ్‍ వరకు ఆమె మంచి మంచి పాటలు పాడింది. ‘ఏమాయ చేసావె‘ సెట్స్ పై ఉన్న సమయంలో సమంతకి చిన్మయి వాయిస్‍ అయితే బాగుంటుందని భావించిన గౌతమ్‍ మీనన్‍ ఆమెతోనే డబ్బింగ్‍ చెప్పించాడు. అప్పట్నుంచి సమంత నటించే ప్రతీ తెలుగు సినిమాకీ చిన్మయినే డబ్బింగ్‍ చెబుతూ వస్తోంది. నిజానికి తొలి సినిమా పూర్తయ్యేసరికి తెలుగు నేర్చు కుంది సమంత. సొంతంగా డబ్బింగ్‍ చెప్పుకో అని దర్శక నిర్మాతలు ఆఫర్‍ కూడా ఇచ్చే శారు. అయితే సమంత మాత్రం తనకంటే తన వాయిస్కే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారని నాకు చిన్మయినే డబ్బింగ్‍ చెబితేనే బాగుంటుందని అలానే కంటిన్యూ అవుతోంది.

తాజాగా ‘జనతా గ్యారేజ్‌’లో కూడా సమంత పాత్రకు డబ్బింగ్‌ చెప్పింది చిన్మయి. ఈ సినిమా విడుదల సందర్భంగా సమంతకు ట్విట్టర్‌ ద్వారా విషెస్‌ చెప్పింది. ‘జనతా గ్యారేజ్‌ విడుదల సందర్భంగా సామ్‌ పాపకు బెస్టాఫ్‌ లక్‌. సమోసాలో ఆలూ ఉన్నంతవరకు సమంతకు డబ్బింగ్‌ చెప్పేది నేనే’ అంటూ ఆమె ట్విట్టర్‌లో కామెంట్‌ చేసింది. కొద్దిసేపటికే సమంత కూడా రీట్వీట్‌ చేసింది. ‘హాహా.. థాంక్స్‌ పాపా’ అంటూ నాలుగు ముద్దులను కూడా పోస్ట్‌ చేసింది సమంత. మొత్తానికి ఈ సమోసా, ఆలూ బంధం బాగుంది కదూ!

ఇద్దరి అనుబంధం ఈ రేంజ్ లో ఉండడంతోనే.. సినిమాల్లో సమంత కేరక్టర్ ఆ స్థాయిలో పండుతోంది. ఆన్ స్క్రీన్ పై సమంత ఎంత ముఖ్యమో.. ఆమె పాత్రకు ఆఫ్ స్క్రీన్ లో చిన్మయి డబ్బింగ్ చెప్పడం అంత ఇంపార్టెంట్. అలా వీరి రిలేషన్ సమసా- ఆలూ అయిపోయిందన్న మాట. ఈ లెక్కన సమంత సమోసా.. చిన్మయి ఆలూ అన్నమాటేగా.