లావణ్య.. తండ్రికొడుకులతో సయ్యాట

687
Lavanya Tripathi Romance Naga Chaitanya
Lavanya Tripathi Romance Naga Chaitanya
- Advertisement -

హీరోయిన్ స్టార్ ఇమేజ్ అందుకోవటం కోసం కష్టపడుతున్న లావణ్య త్రిపాఠి, యంగ్ హీరోలకు లక్కీ గర్ల్ గా మారుతోంది. చాలా రోజులుగా హిట్ కొసం ఎదురుచూస్తున్న హీరోలు లావణ్యతో జతకడితే హిట్ గ్యారెంటీ అన్న పేరు తెచ్చుకుంది ఈ బ్యూటి. అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి తొలి సినిమాతో అందం, అభినయంతో ఆకట్టుకున్నా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇటీవల ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధిస్తుండటంతో వరుస ఆఫర్ లతో బిజీ అవుతోంది.

Lavanya Tripati to romance Nagarjuna?
Lavanya Tripati to romance Nagarjuna?

అక్కినేని నాగార్జున నిర్మాతగా నాగచైతన్య హీరోగా ‘సోగ్గాడే చిన్నినాయనా’ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.

Lavanya Tripati to romance Nagarjuna?

అంతేకాదు మరో హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి నటించనుందని సమాచారం. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని సినీనిపుణులు అంటున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు.. రావు రమేష్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ‘ప్రేమమ్’ సినిమా విడుదలైన తర్వాత, ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారు.

Lavanya Tripathi To Romance With Naga Chaitanya
Lavanya Tripathi To Romance With Naga Chaitanya

ఈ చిత్రానికి ‘ఒకసారి ఇటు చూడవే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా ఉండనుందట. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు నెలలో ప్రారంభంకానుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

అటు మరోవైపు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మిస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

- Advertisement -