రైతులతో కేంద్రం చర్చలు మరోసారి విఫలం..

167
farmer unions
- Advertisement -

వ్యవ‌సాయ చ‌ట్టాల‌పై ఈరోజు కేంద్ర ప్ర‌భుత్వం, రైతు సంఘాల నేత‌ల మ‌ధ్య 8వ విడుత చ‌ర్చ‌లు జరిగాయి. ఈ మేర‌కు ఢిల్లీలోని విజ్ఞాన్‌భ‌వ‌న్‌లో కేంద్ర‌మంత్రులు న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్‌, పీయూష్ గోయల్.. 40 రైతు సంఘాల ప్రతినిధులు స‌మావేశ‌ం జరిగింది. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అయితే ఈ సారి కూడా ఇరువర్గాల మధ్య ప్రతిష్టంభన తొలగలేదు. ఈ నేపథ్యంలో జనవరి 15న మరోసారి సమావేశం కావాలని కేంద్రం నిర్ణయించింది. నూతన వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధతపై ప్రధాన చర్చ జరిగింది. కేంద్రం రైతుల డిమాండ్‌కు అంగీకరించలేదు.

- Advertisement -