కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని యూపీ సీఎం అఖిలేశ్‌యాదవ్ పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన గొప్ప మానవతావాదని, యూపీలో ఎక్కువ రోజులుంటే మంచి మిత్రుడు కాగలడని కితాబిచ్చారు. వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికల్లో ఎస్పీతో కాంగ్రెస్ దోస్తీ ఊహాగానాలకు అఖిలేశ్ వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చాయి. అయితే తాజాగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని గమనిస్తే.. అఖిలేష్‌తో దోస్తీకి రాహుల్ సిద్దంగా ఉన్నట్టు కనిపించడం లేదు.
బుధవారం యూపీలోని మీర్జాపూర్ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలు కొద్ది నెలలే ఉండడంతో అఖిలేష్ తన సైకిల్(ఎస్పీ పార్టీ గుర్తు) ను రిపేర్ చేయడం మొదలుపెట్టాడని అన్నాడు. అఖిలేష్ సైకిల్ టైర్లలో ఒకటి పంక్చరయిందని.. ఆ టైరు(శివపాల్ యాదవ్)ను బయటపడేశాడని అన్నాడు. ఇప్పటికే ఇంటి పోరుతో సతమవుతున్న అఖిలేష్‌ను రాహుల్ గాంధీ కూడా విమర్శించడం యూపీలో చర్చనీయాంశంగా మారింది.
కాగా ఇటీవలే యువ సీఎం అఖిలేశ్ మంచివాడని.. కానీ అతని ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదని అఖిలేష్‌పై.. రాహుల్‌ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. మరీ ఇంతలోనే రాహుల్ ఎందుకు మాట మార్చినట్టో రాబోయే యూపీ ఎన్నికలే చెప్పాలి. ఇక సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో తనయుడు అఖిలేశ్, తమ్ముడు శివ్‌పాల్ యాదవ్ మధ్య అంతర్గత వర్గ పోరు భగ్గుమన్న సంగతి తెలిసిందే. అఖిలేశ్‌ను ఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి.. ఆ పదవిని తమ్ముడు శివ్‌పాల్ యాదవ్‌కు ములాయం కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈ అవమానంతో అఖిలేశ్ రగిలిపోతున్నప్పటికీ ములాయం తమ్ముడికే మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది.