రాజమౌళి బినామి సాయి కొర్రపాటి?..

90
Income Tax officials raid Sai Korrapati office
Income Tax officials raid Sai Korrapati office

సాయి కొర్ర‌పాటి.. రాజమౌళి తీసిన ఈగ ఈ సినిమాతో వెలుగులోకి వచ్చిన పేరు. తర్వాత రాజమౌళి-సాయి కలసి అందాల రాక్షసి సినిమా నిర్మించారు. ఈ సినిమా తర్వాత లెజెండ్‌ సినిమాకి కూడా ఓ నిర్మాతగా వ్యవహరించారు సాయి. దీని తర్వాత తుంగభద్ర, ఊహలు గుసగుస , రాజా చేయివేస్తే, మనమంతా, జ్యో అచ్యుతానంద చిత్రాలు నిర్మించారు. ఇందులో ఏ సినిమాకి పెద్దగా డబ్బులు రాలేదు. మరి ఇలాంటి నేపధ్యంలో నిన్న కొర్రపాటి ఆఫీస్ పై ఐటి దాడులు జరగడం ఫిలింనగర్లో చర్చనీయాంశమైయింది.

ఈ వ్యవహారంపై ఇండస్ట్రీలో ఇన్సైడ్ టాక్ ఏమిటంటే.. సాయికొర్ర‌పాటి ఇండస్ట్రీలోని ఓ బడా దర్శకుడికి బినామీ అట. ఆ దర్శకుడు పేరు రాజమౌళి. ”సాయి పేరు రాజమౌళి ఊరు” అన్నట్లు ఆయన సినిమాలు వుంటాయట. సాయిని వెనుక నుంచి న‌డిపించేది రాజ‌మౌళినేన‌ట‌.

Sai Korrapati

సాయి కొర్రపాటి కార్యాలయంపై ఆదాయపుపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మణికొండలోని వారాహి చలనచిత్రం కార్యాలయంపై రెండు బృందాలు సోదాలు చేపట్టాయి. ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో తొమ్మిది చోట్ల దాడులు చేశారు.

Sai Korrapati

ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లపైనా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను ఐటీశాఖ అధికారులు తనిఖీ చేసినట్లు సమాచారం. కాగా నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన ’ జ్యో అచ్యుతానంద’ చిత్రాన్ని కొర్రపాటి సాయి నిర్మించిన విషయం తెలిసిందే.

సాయి కొర్రపాటి ఆదాయానికి సంబంధించిన పన్నులు సక్రమంగా చెల్లించలేదని ఆరోపణలు రావడంతో సోదాలు చేపట్టినట్లు ఐటీ అధికారులు తెలిపారు.సాయి కొర్రపాటి నిర్మించిన సినిమాలకు ఏ మేరకు ఆదాయం వచ్చింది.. అందుకు సంబంధించి పన్నులు సక్రమంగా జరిగాయా లేదా అన్న అంశాలను పరిశీలించారు.

ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కాగా వారాహి చలన చిత్రం బ్యానర్ పై కొర్రపాటి సాయి ‘ఈగ’, ‘అందాల రాక్షసి’, ‘లెజెండ్’, ‘ఉహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’, ‘తుంగభద్ర’ వంటి హిట్ చిత్రాలను అందించారు. ఇక ఐటీ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.