జియో వర్సెస్ ఎయిర్ టెల్…సరదా ట్విట్లు

279
- Advertisement -

టెలికామ్ రంగంలో పెను సంచలనానికి తెరతీసిన రిలయన్స్ జియో మిగతా ప్రైవేట్ టెలికాం కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా ఎయిర్‌టెల్, ఐడియా తమ కస్టమర్లు చేజారిపోకుండా కాపాడుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నాయి. ‘అతి తక్కువ ధరకు డేటా… ఏ నెట్‌వర్క్‌కైనా వాయిస్ కాల్స్ ఫ్రీ’.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నోటి నుంచి వచ్చిన ఈ రెండు మాటలు ఎయిర్‌టెల్, ఐడియాకు కోట్ల నష్టాన్ని మిగిల్చాయి. దీంతో రిలయన్స్ జియోకు టెలికాం కంపెనీలు చుక్కలు చూపుతున్నాయి.

జియో నుంచి ఇతర టెలికాం నెట్‌వర్క్‌లకు వచ్చే ఫోన్ కాల్స్‌ అన్నీ కాల్ డ్రాప్ అవుతున్నాయి. దీంతో జియో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత 10 రోజుల్లోనే జియో కస్టమర్లు 52 కోట్ల కాల్స్ ఫెయిలయ్యాయి. ఇది రిలయన్స్ జియోకు గట్టి ఎదురుదెబ్బవంటిది. ఈ కాల్‌డ్రాప్స్ సమస్యతో దాదాపు రోజుకు 5 లక్షల మంది వినియోగదారులు ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. రిలయన్స్ జియో తమ పొట్ట కొడుతున్నాయని భావించిన అన్ని కంపెనీలు ఒక్క విషయంలో మాత్రం ఏకమయ్యాయని జియో చెబుతోంది. తమ నెట్‌వర్క్ నుంచి చేసే కాల్స్‌పై అన్ని కంపెనీలు కక్ష కట్టాయని జియో ఆరోపిస్తోంది.

JIO

దీంతో జియోతో పోరు తాళలేక మిగితా టెలికాం సంస్థలకు చుక్కలు కనిపిస్తున్నాయని…సోషల్ మీడియాలో సరదా సరదా ట్విట్లు సందడి చేస్తున్నాయి.రిలయన్స్ జియో..అందులో లాభనష్టాల్ని వివరిస్తూ ఎన్నో పోస్ట్ లు పెడుతున్నారు. ఎయిర్ టెల్‌లో ఆకర్షణీయమైన ఉద్యోగాలు అంటూ సరదా ప్రకటనలు వెలువడుతున్నాయి. ఉద్యోగాల కోసం carrers@airtel.inకు రెస్యూమ్ పంపాలని….దీనికి చివరి తేది 30 డిసెంబర్‌ అని ప్రకటనలో ఉంది. ఎంపికైన వారు ముంబైలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని….నెలకు 95 వేల జీతం ఇస్తామంటు ప్రకటన సారాంశం. చివరగా చేయాల్సిన పనిగురించి తెలుసుకున్న వారు ముసిముసి నవ్వులతో తమ అనుభవాన్ని ఇతరులతో పంచుకుంటున్నారు. ఎయిర్ టెల్ టవర్‌ కింద కూర్చోని….జియో సిగ్నల్స్ ఆపడమే పని….ఐఐఎన్ విద్యార్థులకు మొదటి అవకాశం ఇస్తామన్న ప్రకటనలతో జియో నుంచి మిగితా టెలికాం సంస్థలు చుక్కులు చూస్తున్నాయన్న వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

reliance

ఇక జియో ని విమర్శిస్తూ కూడా రకరకలా సెటైర్లు వెలువడుతున్నాయి. ఆ సరదా సెటైర్ మీకోసం.. రిలయన్స్ వాళ్లు ఒక హోటల్ పెట్టారు..ఆ హోటల్ లో టిఫిన్ కేవలం రెండు రూపాయలే. దీంతో జనం ఎగబడి వచ్చారు. అనంతరం ఒక్క రూపాయికే అన్ లిమిటెడ్ లంచ్…ఇక చెప్పేదేముంది అక్కడున్న జనాలతో పాటు.. ఇంకా ఫుల్ గా జనాలు వచ్చి కడుపునిండా తిన్నారు..అక్కడితో ఆగకుండా అర్ధరూపాయికే డిన్నర్ అన్నారు..దీంతో జనాలు మరింతగా ఎగబడి డిన్నర్ కూడా చేశారు.చివరకు జనాల పొట్టలు పగిలిపోయే స్థితి వచ్చి.. అర్జెంటుగా బాత్ రూం వెళ్లాల్సిన అవసరం వచ్చింది.సరిగ్గా అప్పుడే..టాయిలెట్ వాడుకోవడానికి రూ. 10000 రేటు అని రిలయన్స్ బోర్డు పెట్టిందన్న సరదా విమర్శలతో కూడిన ట్విట్లు దర్శనమిస్తున్నాయి.

                                    jio

                                    ambani

                                     rjio

- Advertisement -