యాంకర్ ఝాన్సీ నోరు జారింది

232
Anchor Jhansi's Irresponsible Comment on Yesudas
Anchor Jhansi's Irresponsible Comment on Yesudas
- Advertisement -

అత్యుత్సాహం ఒక్కోసారి చేసిన పొరపాటును కూడా గమనించుకోకుండా చేస్తుంది. సరిగ్గా యాంకర్ ఝాన్సీ విషయంలో ఇదే జరిగింది. ఆర్పీ పట్నాయక్ స్వీయ చిత్రం ‘మనలో ఒకడు’ ఆడియో సక్సెస్ మీట్ ను తిరుపతిలో ఏర్పాటు చేసారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా ప్రముఖ గాయకుడు యేసుదాసు విచ్చేశారు. ఈ సందర్భంగా యేసుదాసును ఘనంగా సత్కరించారు.

Anchor Jhansi's Irresponsible Comment on Yesudas

వేదికల మీద వ్యాఖ్యాతగా వ్యవహరించడమంటే మామూలు విషయం కాదు. ఏ చిన్న తప్పిదానికి చోటిచ్చినా.. అందరిలో నవ్వులపాలు కావాల్సిందే. ఇక సినీ కార్యక్రమాలకు సంబంధించిన వేదికలపై అయితే మరింత జాగ్రత్తగా మసులుకోవాల్సిందే. అంతా సెలబ్రిటీలే హాజరవుతారు కాబట్టి.. మాటల్లో తప్పులు దొర్లితే అభిమానులు సదరు యాంకర్స్ ను టార్గెట్ చేస్తారు.

Anchor Jhansi's Irresponsible Comment on Yesudas

ఇదంతా పక్కనబెడితే.. తాజాగా జరిగిన ‘మనలో ఒకడు’ ఆడియో సక్సెస్ మీట్ లో.. ప్రముఖ గాయకుడు ఏసుదాసు గురించి సంబోధిస్తూ యాంకర్ ఝాన్సీ.. ‘అమర గాయకుడు ఏసుదాసు’ గారు అని వ్యాఖ్యానించింది. దీంతో ఆడియో వేడుకకు హాజరైన జనమంతా ఒక్కసారిగా అవాక్క య్యారు. కొంతమంది నవ్వు కున్నారు కూడా.

Anchor Jhansi's Irresponsible Comment on Yesudas

అయితే ఝాన్సీ ఎంత పొరపాటు చేసాననేది గుర్తించలేకపోయింది. సదరు పొరపాటును గమనించక అదే క్రమంలో కొనసాగించుకుంటూ మాట్లాడేసింది. అయితే ఝాన్సీ చేసిన వ్యాఖ్యలకు అర్ధం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల కాలంలో ఝాన్సీ నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ఇలాంటి పొరపాట్లు సర్వసాధారణమైపోతున్నాయి.

Anchor Jhansi's Irresponsible Comment on Yesudas

ఒకప్పుడు బుల్లితెరను ఏలిన ఝాన్సీ యాంకరింగ్ ప్రస్తుతం అవుట్ డేటెడ్ స్థాయికి చేరుకుంది. అర్ధం పర్ధం లేని అతిశయోక్తులతో కర్ణకఠోరంగా మారిపోవడం వలనే చాలా అరుదుగా దర్శనమిస్తోంది. అలా దక్కిన ఒకటి, రెండు అవకాశాలను కూడా ఏదొక పొరపాటు చేసి అబాసుపాలవుతోంది. దీంతో ఝాన్సీ యాంకరింగ్ అప్ డేట్ కావాలన్న సూచనలు సర్వత్రా వినపడుతున్నాయి.

- Advertisement -